ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది మంత్రుల పనితీరు విషయంలో సీఎం జగన్ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పనితీరు విషయంలో సీఎం జగన్ చాలా సంతోషంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆయన పరిశ్రమల శాఖ అభివృద్ధి కోసం వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అందరి తో కూడా కలుపుకొని పోయే విధంగా ముందుకు వెళ్తున్నారు. గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా పరిశ్రమలు ఏవి కూడా రాలేదు.

అయితే ఇప్పుడు నూతన పారిశ్రామిక పాలసీని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తుంది. దీనితో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమలను ఆహ్వానించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తక. ఒక ప్రత్యేక ప్లానింగ్ ద్వారా ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కొత్త కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సీఎం జగన్ కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో ఇప్పుడు మంత్రి క్షేత్రస్థాయిలో కష్టపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయం చాలా వరకు కీలకంగా మారింది.

దీంతో త్వరలోనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా మంత్రి ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత డిసెంబర్ లేదా జనవరిలో నెలలో కొన్ని సమ్మిట్ లు కూడా ఏర్పాటు చేసే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు సీఎం జగన్ వద్ద ఆయన కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టారట. చిన్న చిన్న పరిశ్రమలను కూడా ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పే విధంగా మంత్రి ఒక ప్రత్యేక ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా రుణాలు ఇప్పించాలని మంత్రి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనను కూడా ఆయన సిఎం వద్ద పెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: