ఇప్పుడు మనం ఎక్కువగా వానలు పడడం చూస్తున్నాం. ఈ వానలు పడటం తో చుట్టు ప్రక్కల వాతావరణం పచ్చగా మారడం మొదలు పెడుతుంది. ఇంక దోమలు స్వైర విహారం చేయడం మొదలు పెడతాయి. చెత్త ద్వారా కూడా దోమల బెడద మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలా డెంగ్యూ తీవ్రత బాగా పెరిగిపోతుంది. ఇంక డెంగ్యూ వచ్చిందా...? అంతే సంగతులు. జ్వరం రావడం, కీళ్ల నొప్పులు, విపరీతమైన తలనొప్పి, వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు, దురద వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినట్టయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అలానే దోమలు తమ పరిధిలోనికి రాకుండా చర్యలు తీసుకోవడం మంచిది.
 

డెంగ్యూ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది...? ఈ విషయానికి వస్తే..... ఈడెస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమల వల్ల ఇది కలుగుతుంది. ఈ జబ్బు చేసి ప్రాణాలను కూడా పోగొట్టుకున్నవాళ్లున్నారు.   డెంగ్యూ సోకిన వారిలో కొంత మందికి డెంగ్యూ హెమరేజిక్ జ్వరం వంటి సమస్యలతో బాధ పడుతున్నట్లుగా గుర్తించారు. జ్వరం తీవ్రత ఒక్కో సారి 105 డిగ్రీల వరకు కూడా ఉండవచ్చు. కానీ  జ్వరం అధికంగా ఉంటే కరోనా అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు.  కాని అది   డెంగ్యూ వ్యాధి కూడా కావొచ్చు అని అంటున్నారు. ఇది కనుక వస్తే ఆకలి వేయదు. రుచిని గ్రహించలేరు. అలాగే డెంగ్యూ వచ్చిన వారిలో బీపీలో తగ్గుదల ఉంటుంది.

ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి వచ్చిన వారు త్వరగా అలసిపోతుంటారు. ఇది గమనించండి. ఎంత  చిన్న పని చేసినా బాగా అలసిపోతారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే....?  ఇలాంటి లక్షణాలన్నీ కొన్ని కేసుల్లో మాత్రమే కనిపిస్తాయి. అన్ని కేసుల్లో ఇవి కనిపించకపోవచ్చు. కనుక జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. జాగ్రత్తలు కనుక పాటించకపోతే  ప్లేట్ లేట్స్ తగ్గి ప్రాణాల మీదికే రావచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: