ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కాలం మారింది...రాజకీయాలు మారాయి....పాలన పగ్గాలు చంద్రన్న చేతినుండి.... వైయస్ జగన్ చేతికి వెళ్ళాయి... కానీ అమరావతి రాజధాని విషయం పై 5 ఏళ్లు గడుస్తున్నా విషయం ముందుకు సాగనంటోంది... ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే అసలు అమరావతిపై ఆసక్తి లేదని ఎలాగో తేలిపోయింది... అందుకే వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కేంద్రం కూడా రాష్ట్ర రాజధాని విషయం పూర్తిగా రాష్ట్రానికే పరిమిత మంటూ సైలెంట్ గా ఉండి పోవడంతో అమరావతి ఏకైక రాజధానిగా ఉండే విషయం కాస్తా అటకెక్కింది. నిజానికి అప్పట్లో అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేయాలంటూ.... ఎన్నో నిరసనలు చేపట్టారు...

తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతికి అండగా ఉంటూ రాజధాని విషయం పై నిరసనలకు దిగారు.... సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ చేతుల మీదగా ప్రారంభమైన ఈ శుభకార్యం ఎవరు  ఆపలేరని అందరూ భావించారు. కానీ కేంద్రం మాత్రం మాకేం అభ్యంతరం లేదని ప్రకటించడంతో ఈ వాదన కాస్త వెనక్కి పోయింది. వాస్తవానికి అమరావతి రాజధాని విషయంలో తూట్లు పొడిచిన వాళ్ళల్లో కేంద్రం పాత్ర ముఖ్యమైనదనే చెప్పాలి. ఎందుకంటే అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగిన సమయంలో నరేంద్ర మోడీ కేవలం కాస్త మట్టి నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.... అంతకుమించి ఒక్క హామీ కానీ, భరోసా కానీ ఇవ్వలేదు... రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు కూడా మోడీ ఇచ్చిన మట్టిని నీళ్ళని మహా ప్రసాదంగా తీసుకున్నారే తప్ప.... అంతకుమించి ప్రత్యేక హోదా గురించి కానీ మిగిలిన విషయాల గురించి గానీ ప్రధానితో ప్రస్తావించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమరావతి పట్టణాభివృద్ధి శాఖ కింద  డ్రైనేజీ కోసం వెయ్యి కోట్లు కూడా కలిపి... 2500 కోట్లు ప్రకటించారే తప్ప.... నిజానికి చేరింది.. చూస్తే అది 1500 కోట్లు కూడా దాటదు....

అమరావతిలో క్వార్టర్స్  కట్టారు కానీ వాస్తవానికి అవి ఏమి రాజధానికి పరిగణనలోకి రావు... మొత్తానికి అమరావతిని భ్రమరావతి చేశారనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి..... అక్కడ వ్యవసాయ భూములు కొనుగోలు విషయంలో కొన్ని లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. కానీ అప్పటి ముఖ్యమంత్రి వాటిని సమర్థించారు.... ఇదంతా ఉద్దేశపూర్వకంగానే పక్కా ప్లానింగ్ ప్రకారం... అమరావతి రాజధాని విషయం పక్కదారి పట్టించడమే తప్ప... నిజంగా మనస్పూర్తిగా చంద్రబాబునాయుడు అనుకొని ఉంటే పూర్తి చేయడం పెద్ద విషయం కాదని చాలా చర్చలు జరుగుతున్నాయి... నామమాత్రానికి సింగపూర్ తో  అమరావతి రాజధాని నిర్మాణంలో ఒప్పందం కుదుర్చుకుందే తప్ప.... అక్కడ ఒరిగింది ఏమి లేదు.... ఇదంతా కేంద్రం చూస్తూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేంద్రం బాధ్యత సరిగా వహించ లేదని... బూటకాలు చెప్పి తప్పించుకున్నది తప్ప... ఉపయోగం లేదని అందుకే ప్రజలైనా అనుచరుడైన పాలకులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకుండా...విచక్షణారహితంగా నెత్తిన పెట్టుకోకుండా విమర్శనాత్మకంగా  చూసి విషయాన్ని గ్రహించాలని కొందరు ప్రముఖులు ఈ విషయంపై విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: