ఆదివారం  సాయంత్రం కిడ్నాప్ అయిన దీక్షిత్  వ్యవహారానికి సంబంధించి జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన  కీలక విషయాలు వెల్లడించారు.  బాలుడుని కిడ్నాప్ చేసింది చంపింది ఒక్కడే అని ఆయన తెలిపారు. మెకానిక్ గా పని చేసే వ్యక్తి డబ్బుల కోసం ఈ పని చేసాడని అన్నాడు. బాలుడి కిడ్నాప్ కి  ముందు రెక్కీ నిర్వహించి మంద సాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసాడని తెలిపారు. ఈనెల 18న రంజిత్‌ రెడ్డి పెద్ద కుమారుడు దీక్షిత్‌ ను కిడ్నాప్‌ చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బాలుడిని కిడ్నాప్‌ చేశారు అని ఎస్పీ వివరించారు.

కిడ్నాప్‌ చేసిన 2 గంటల లోనే దీక్షిత్‌ హత్య జరిగి ఉండవచ్చు అని ఆయన చెప్పారు. అతి తొందరగా డబ్బులు సంపాదించాలనే దురాశతోనే కిడ్నాప్‌ జరిగింది అని అన్నారు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన వ్యక్తి మెకానిక్‌ మంద సాగర్‌ అన్నారు. దొరికిపోతామనే భయంతోనే బాలుడిని చంపేశారు అని ఎస్పీ వివరించారు. సీసీ కెమెరాల లేని ప్రాంతం నుంచి బాలుడిని తీసుకెళ్లారు అని ఆయన చెప్పారు. తెలిసిన వాళ్లు కావడం వల్లే వారితో బాలుడు వెళ్లాడు అని ఆయన చెప్పారు. మంద సాగర్‌కు సీసీ కెమెరాలు, సెల్‌ టవర్లు ఎక్కడున్నాయో తెలుసు అని అన్నారు.

బాలుడి కిడ్నాప్‌కు ముందు రెక్కీ చాలా పక్కాగా నిర్వహించారు అని ఎస్పీ చెప్పారు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన సీసీ కెమెరాల దృశ్యాలు సేకరించాం అని ఆయన అన్నారు. సాయంత్రం లోగా పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనిగాపురం గ్రామానికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసాడు అని ఆయన వివరించారు. ఇక  నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఎన్కౌంటర్ చేసారు అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: