కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో ఎప్పుడు పర్యటించిన అధికారులు అక్కడికి వెళ్లడం లేదు .ఇది అధికారుల నిర్లక్ష్యమా , లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడా.

 ఆయన సికింద్రాబాద్ ఎంపీ మాత్రమే కాదు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి . సికింద్రాబాద్ లో మాత్రమే కాకుండా తెలంగాణలో పలు ప్రాంతాల్లో  పర్యటిస్తూ ఉంటారు. కేంద్రమంత్రి వస్తే కొన్ని ప్రోటోకాల్ ఉంటాయి అధికారులు వాటిని పాటించాల్సి ఉంటుంది.

 సికింద్రాబాదులోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించినప్పుడు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అప్పుడు  డు ఆయన వెంట అధికారులు ఎవరూ రాలేదు అని కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు .

నేను ఒక కేంద్ర మంత్రి నాకు ఆ మాత్రం గౌరవం కూడా ఇవ్వరా మరీ ఇంత నిర్లక్ష్యమా ఢిల్లీ వెళ్లిపోమంటే వెళ్ళిపోతాను అని చెప్పారు.

  దీంతో బిజెపి నాయకులు కార్యకర్తలు ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితోనే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను తమ బానిసలుగా చూస్తున్నారని బీజేపీ నాయకులు అన్నారు. అన్ని రంగాల అధికారులు ప్రభుత్వం  ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నారు .

కేంద్ర మంత్రి వస్తే అధికారులు ఎలా నడుచుకోవాలో వాళ్లకి తెలియదా ఎవరైతే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారో వారిని  వెంటనే సస్పెండ్ చేయాలి అని బీజేపి కార్యకర్తలు అన్నారు .

  ఈ అంశంతో రాష్ట్ర ప్రభుత్వం పై రాజకీయం చేసే ఆలోచన కిషన్ రెడ్డి కి   లేదంట. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు అని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం   ఈ ప్రాంతానికి చెందిన వాడిగా తెలంగాణకు ఎప్పుడు అన్యాయం జరగకుండా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గా రాష్ట్ర ప్రభుత్వం కూడా తనను సంప్రదిస్తే తప్పకుండా కేంద్రాన్ని ఒప్పించి మరీ నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: