తెలంగాణ రాష్ట్రంలో రానున్నఎన్నికలకు...ఇప్పటినుండే మొదలైన రాజకీయ నాయకుల కసరత్తులు. ఎలాగైనా పదవి చేజిక్కించుకుని ప్రజల పాలనలో మునిగి తేలాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు పలు పార్టీ నాయకులు. ప్రస్తుతం బిజీగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ సైతం మరోసారి ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టడం లేదు. అటు జాతీయ పార్టీ అయిన బిజెపి, కాంగ్రెస్ కూడా ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.... గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ఇరు పార్టీలు ఎన్నికలకు ఎలా రంగం సిద్ధం చేస్తున్నారు అర్థం అవుతుందని అంటున్నారు పలు వర్గాల నాయకులు..... ప్రస్తుతం దుబ్బాక పై ఫోకస్ పెట్టిన ఇరుపార్టీలు వారి హవా చాటుతున్నారు.

గత వారంలో హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలకు వాటిల్లిన కష్టాలు అందరికీ తెలిసిందే... అయితే ఈ సమస్యలేవీ ఎన్నికలపై అంతగా ప్రభావం చూపవు.... ఒకవేళ అటువంటి పరిస్థితి ఎదురైనా మన నాయకులు సమస్యను కాస్త స్థానికానికి పరిమితం చేస్తూ మాట దాటేస్తారు అని... మరో వర్గం యొక్క వాదన...... ఏదేమైనా అటు టిఆర్ఎస్ ఇటు జాతీయ పార్టీ బిజెపి కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి చూస్తుంటే రానున్న ఎన్నికలకు భారీ స్థాయిలో ప్రణాళికలు రచించినట్లు అర్థం అవుతోంది. మరోపక్క ఎన్నికలను ఇరు పార్టీలు ఒక సవాలుగా తీసుకున్నట్టు అందుకే నువ్వా నేనా అన్నంతగా ఎన్నికల కసరత్తులు జరుగుతున్నట్లు సమాచారం.

మరోవైపు బిజెపి,కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తరువాత మా రాష్ట్రము తెలంగాణ... అన్నట్లుగా మాట్లాడుతున్నారు.... కానీ అదే కనుక నిజమైతే ఆ సంకేతాలు కనిపిస్తాయి.... కానీ అటువంటివి ఏమి.. కనుచూపు మేరలో కూడా లేవు. కానీ రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. అయితే వచ్చే ఎన్నికలలో తెరాస కి బీజేపీ బలంగానే ఎదురునిలబడనుందని తెలుస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: