కరోనా వ్యాక్సిన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నా సరే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి లేదు. ఈ వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా చాలా తీవ్రంగా కష్టపడుతున్నా సరే ఇప్పటి వరకు ముందుకు అడుగు మాత్రం స్పష్టంగా పడటం లేదు అనే చెప్పాలి. వ్యాక్సిన్ లో ఏదోక ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వ్యాక్సిన్ కి సంబంధించి సి సి ఎం బీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేసారు. రెండేళ్ళ వరకు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని సంచలన ప్రకటన చేసారు.

భారతదేశంలో కరోనా వైరస్ తగ్గిపోయిందనుకుంటే పొరపాటే అని హెచ్చరించారు. కరోనా వైరస్ ను అపోహలతో  కొందరు తక్కువ అంచనా వేస్తున్నారు అని అన్నారు. ప్రజలు అపోహలు వీడి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని సూచించారు. భారత్ బయోటెక్, అరబిందో ఫార్మసీ సహా.. వివిధ కంపెనీలతో కలసి వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతున్నాం అని అన్నారు. వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ పై స్పష్టత రావొచ్చు అని తెలిపారు. మూడు నెలలుగా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతున్నాం అని అన్నారు.

కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకురావటం చాలా కష్టమైన వ్యవహరం అన్నారు. పరిశోధనలకు తోడు అదృష్టం కూడా కలసిరావాలి అని అన్నారు. హైద్రాబాద్ ఆసుపత్రుల్లో కరోనా రోగులు తగ్గటం సంతోషకరం అని చెప్పారు. ఆసుపత్రులను పరిశీలించి కరోనా వైరస్ పై అంచనాకు రాకూడదు అని ఆయన పేర్కొన్నారు. పుట్టగొడుల్లో ఉండే పదార్థంతో ఏ ఐసి తో కలసి ఇమ్యూనిటీ బూస్టర్ ను అభివృద్ధి చేశాం అని చెప్పారు. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవటానికి ఇమ్యూనిటీ బూస్టర్ రోగనిరోధక శక్తిని పెంచుతోందని పేర్కొన్నారు. ఆహారంతో కలపి ఇమ్యూనిటీ బూస్టర్ ను తీసుకోవాలని అన్నారు. చాలా కాలంగా భారతీయులు పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటున్నారని చెప్పారు. ఇమ్యూనిటీ బూస్టర్ వలన ఇతర ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: