ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వాన్ని టార్గెట్ గా... చేసుకుని వృక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విపక్ష తెలుగుదేశం పార్టీ పదేపదే టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. రాజకీయంగా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని అంశాలను ప్రధానంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ అశోక్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

రాష్ట్రంలో జరగాల్సిన నష్టమంతా జరిగాక ఇసుక విధానంపై సలహాలు, సూచనలు కోరుతూ జగన్ ప్రభుత్వం ప్రకటనలిచ్చింది అని ఆయన మండిపడ్డారు. ప్రజలకు నాణ్యమైన ఇసుకను అందించలేని అసమర్థ ప్రభుత్వం, చివరకు ప్రకటనలు ఇచ్చే స్థాయికి దిగజారింది అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చినప్పుడే , దానిలోని డొల్లతనాన్ని తాము బయటపెట్టాం అని ఆయన ఆయన అన్నారు. ప్రభుత్వం ఇసుక దోపిడీయే లక్ష్యంగా వ్యవహరించడంతో నిర్మాణ రంగం కుదేలై, భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు అని ఆయన ఆయన పేర్కొన్నారు.

అదే విధంగా గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం తప్ప, జగన్మోహన్ రెడ్డికి మరో గత్యంతరం లేదు అని ఆయన వివరించారు. ఉచితంగా ఇసుక లభిస్తేనే నిర్మాణ రంగం పుంజుకొని, కార్మికులకు ఉపాధి లభించి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని అన్నారు. అదే విధంగా మైనింగ్ మాఫియాను కట్టడి చేసేలా చట్టాలను బలోపేతం చేస్తే మంచిది అని ఆయన సూచించారు. ఎమ్మార్వో స్థాయి అధికారి అనుమతితో మైనింగ్ చేసుకునేలా నిబంధనలు మార్చడం వల్ల, ప్రకాశం జిల్లా సహా,  మైనింగ్ మాఫియా రాష్ట్రంలో రెచ్చిపోతోంది అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇసుక విధానం విషయంలో సలహాలు అడిగిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: