ఈ నెల 9న బంగారు ఆభరణాలు స్కూటీపై తీసుకెళ్తుండగా నగలు మాయం అయిన కేసును ఛేదించారు బంజారాహిల్స్ పోలీసులు. బషీర్ బాగ్ వీఎస్ గోల్డ్ నగల దుకాణం నిర్వాహకులు జూబ్లీహిల్స్ లోని కృష్ణ పెరల్స్ ఆభరణాల షాపు లో ఓ కస్టమర్ కోసం ఆభరణాలు తీసుకుని సేల్స్ మెన్ వచ్చాడు. వాటిని ద్విచక్ర వాహనంపై తిరిగి వీఎస్ గోల్డ్ తీసుకెళుతున్న ప్రదీప్ అనే సేల్స్ మన్ బంజారాహిల్స్ లో రోడ్డుపై వరదనీటినిలో కొట్టుకుపోయింది. స్థానికులతో కలిసి బ్యాగ్ కోసం వెతికిన క్రమంలో ఖాళీ బ్యాగ్ దొరికింది.

బంజారాహిల్స్ పీఎస్ లో యజమాని ఫిర్యాదు చేసారు. దర్యాప్తు చేసి  నలుగురు నిందితులను అరెస్ట్ చేసారు. వీరి నుంచి కోటి రూపాయలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు బంజారాహిల్స్ లో బంగారం మాయం కేసును ఛేదించారని అన్నారు. నలుగురు లేబర్ గ్యాంగ్ ఈ చోరీ లో భాగం వహించినట్టు గుర్తించి అరెస్ట్ చేశారు అని ఆయన తెలిపారు. చోరీకి గురి అయిన బంగారం విలువ కోటి రూపాయల పైనే ఉంటుంది అని అన్నారు.

స్విచాఫ్ అయిన ఫోన్ ఆధారంగా ఈ కేసును ఛేదించారు అని అన్నారు. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ... 9 వతేదీన సాయంత్రం ప్రదీప్ అనే వ్యక్తి బంగారం తీసుకుని వెళ్తుంటే బంజారాహిల్స్ లో ప్రమాదం జరిగి కింద పడ్డారు అని అన్నారు. కింద పడటంతో ఆభరణాలు ఉన్న బ్యాగ్ కింద పడిపోయింది అని చెప్పారు. బ్యాగ్ వరద ఉధృతి కాస్త ముందుకు కొట్టుకుపోయింది అని చెప్పారు. ఆ తర్వాత ప్రదీప్ పోలిసులుకు ఫిర్యాదు చేసాడు అని అన్నారు. ముందుగా ఫిర్యాదు దారుడినే అనుమనించాము అని చెప్పారు. ఆ తర్వాత ఈ విషయంలో అతని ప్రమేయం లేదని తెలుసుకున్నాక దర్యాప్తు ముమ్మరం చేసాము అని ఆయన చెప్పారు. కేసు రికన్స్ట్రక్షన్ చేపట్టాక తమకు ఓ స్పష్టత వచ్చింది అని అన్నారు. ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయిన ఫోన్ ద్వారా ఈ కేసును ఛేదించడం జరిగిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: