ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఉంచాలి అంటూ ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి ప్రాంతానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. పోలీసులు కూడా నిరసనలు చేసేవారి విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దు అంటూ అక్కడి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశానికి అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున చేరుకుని నినాదాలు చేశారు.

ఇక తాజాగా అమరావతి ప్రాంతం పై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరును రాజధానికి పెట్టి ఆ పేరును చెడగొట్టారు అని ఆయన అన్నారు. ప్రస్తుతం అమరావతి రాజకీయ ఎత్తుగడలకు కేంద్రంగా మారింది అని మండిపడ్డారు. తానే అమరావతికి పేరు తెచ్చినట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అని అన్నారు. ధ్యాన బుద్ధ విగ్రహం పై చంద్రబాబుకు పేటెంట్ లేదు  అని స్పష్టం చేసారు. మనుషుల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా టీడీపీ నేతలు వ్యవహరించడం బాధాకరం  అని అన్నారు.

ఇంకా ఎన్ని రోజులు ఈ పెయిడ్ ఆందోళనలను నడిపిస్తారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో పెయిడ్ దీక్షలకు కమ్యూనిస్టులు మద్దతు తెలపడం దారుణం అని అన్నారు. చరిత్రలో భూస్వామ్యులకు వత్తాసు పలికిన చరిత్ర ప్రస్తుత కమ్యూనిస్టులకే చెల్లింది అని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో వైఎస్.జగన్ ముందుంటారు  అని అయన అన్నారు. అమరావతిలో రైతులకు మేలు చేస్తున్నది వైఎస్.జగన్ ఒక్కరే అని స్పష్టం చేసారు. రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే...ఓ రిప్రజెంటేషన్ ను సీఎంకు ఎందుకు అందజేయరు అని  నిలదీశారు. తాత్కాలిక రాజధానిని కట్టానని చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదు  అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: