ఈ కాలంలో పిల్లలను పెంచాలన్న, చదివించాలన్న ఎంత ఖర్చు అవుతుందో చెప్పక్కర్లేదు.. ఇప్పటి పరిస్థితులలో ఎంత కష్టపడిన గాని రాబడి అనేది తక్కువగానే ఉంటుంది. అందుకనే ముందు జాగ్రత్తతో  చాలామంది తమ పిల్లల చదువుల నిమిత్తం కొంత మొత్తాన్ని పొదుపు రూపంలో గాని, పెట్టుబడులు, ఇన్సూరెన్స్‌ కట్టడానికి గాని కేటాయిస్తున్నారు.పిల్లల కోసం ప్రత్యేకంగా చేసే పొదుపు, పెట్టుబడులు  భవిష్యత్తులో వారికి ఆర్థిక భరోసా కలిగిస్తాయి. .అందుకనే  భవిష్యత్తులో పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను భరించడానికి,  వారికీ ఆర్థిక భరోసా కల్పించడానికి కొన్ని ముఖ్యమైన  చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుని మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు  వేయండి.




పిల్లల కోసం ప్రవేశ పెట్టబడిన స్కీమ్స్ లో పబ్లిక్  ప్రొవిడెండ్ ఫండ్ ఒకటి. ఈ పథకానికి  15 సంవత్సరాల కల వ్యవధి ఉంటుంది. పీపీఎఫ్‌లో పిల్లల చదువుల కోసం కార్పస్ ఫండ్‌ను తయారుచేసుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం ఎనిమిది శాతం వడ్డీ రేటు ఉంది. వివిధ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు 7.5 శాతం వరకే ఉన్నాయి. కానీ పీపీఎఫ్‌ అందించే వడ్డీ రేట్లను వచ్చే త్రైమాసికం నుంచి రిజర్వ్‌ బ్యాంక్ పెంచే అవకాశం ఉంది.అంతేకాకుండా ఈ  పథకం ద్వారా అందే వడ్డీపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. సెక్షన్ 80 సి ప్రకారం రూ .1.5 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ కూడా పొందవచ్చు. అలాగే ఇంకొక ప్లాన్ ఎస్బీఐ స్మార్ట్ చాంప్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది పిల్లల భవిష్యత్తుకు, విద్య అవసరాలకు తప్పకుండా  భరోసా కల్పిస్తుంది. స్మార్ట్ ఛాంప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో వ్యక్తిగత జీవిత బీమా కూడా లభిస్తుంది. పాలసీ వ్యవధిలో మనకు అవసరమయ్యే ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిచడంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అనుకోని ప్రమాదాల వల్ల చనిపోయినా లేదా శాశ్వత వైకల్యం బారిన పడినా ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందవచ్చు. పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తరువాత నాలుగు సమాన వాయిదాలలో స్మార్ట్ ప్రయోజనాలు చెల్లిస్తారు.




పిల్లల కోసం మరొక ప్లాన్ అందుబాటులో ఉంది. అదే సుకన్య సంవృద్ధి యోజన పథకం. అయితే ఇది కేవలం ఆడపిల్లలకు మాత్రమే  వర్తిస్తుంది.ఆడ పిల్లల చదువుల కోసం పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. సుకన్య సమృద్ధి యోజన కింద మీ పిల్లల చదువులు, పెళ్లి కోసం మీరు ఇందులో డబ్బును దాయవచ్చు. అలాగే ఈ పథకంలో 8.5 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. దీనిపై కూడా సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ దీనికి లాక్‌ ఇన్‌ పీరియడ్ ఉంటుంది. ఒక నిర్ణిత సమయంలో మాత్రమే డబ్బును తీసుకోవచ్చు..ఈ పథకంలో నిర్ణీత వడ్డీ రేట్లు కొనసాగవు. అయితే బ్యాంకులు అందించే వడ్డీ రేట్లకంటే సుకన్య సమృద్ధి యోజనలో వచ్చే వడ్డీ రేటు ఎక్కువ.




గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా మీ పిల్లల కోసం బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎలక్ట్రానిక్ రూపంలో కూడా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి నెలా చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెడుతూ కార్పస్ ఫండ్‌ను జమ చేయవచ్చు. సాధారణంగా 10 నుంచి 15 సంవత్సరాల హోల్డింగ్ పీరియడ్‌ను ఎంచుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌లను అమ్మే సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలి. గోల్డ్ సేవింగ్స్‌లో జ్యువెలరీ స్కీమ్‌లను కూడా ఎంచుకోవచ్చు. ఆడపిల్లలకు ఆభరణాలు కొనడానికి ఇవి ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: