జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటేసింది. అంటే సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 17 నెలలు అవుతుంది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ సీఎం చేయని విధంగా ఒక్కసారిగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టారు. 25 మందితో ఉన్న జగన్ టీం అదరగొడుతుంది. ఇక మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడే జగన్...రెండున్నర ఏళ్లలో మరొకసారి మంత్రివర్గం ఏర్పాటు చేస్తానని చెప్పారు.

కానీ మధ్యలో మండలి రద్దు అంశం రావడంతో మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లని కేబినెట్ నుంచి తప్పించి, రాజ్యసభలు ఇచ్చారు. ఇక వారి స్థానాల్లో సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్‌లకు అవకాశం ఇచ్చారు. అయితే మరో 13 నెలల్లో జగన్ మంత్రి వర్గ విస్తరణ చేయనున్నారు. అప్పుడు పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టేసి కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు.

ఆ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుందో లేదో తెలియదు గానీ, జిల్లాల వారీగా చూసుకుంటే మూడు జిల్లాలకు బంపర్ ఆఫర్ మాత్రం వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలు తప్పా, మిగిలిన జిల్లాల్లో ఒకరి కంటే ఎక్కువగానే మంత్రి పదవులు ఇచ్చారు. ఈ మూడు జిల్లాల్లో ఒక్కొక్కరే మంత్రిగా ఉన్నారు. విశాఖలో అవంతి శ్రీనివాస్, గుంటూరులో సుచరిత, అనంతలో శంకర్ నారాయణలు జగన్ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు.

దీంతో ఈ మూడు జిల్లాలకు మరో మంత్రి పదవి దక్కడం ఖాయమని అర్ధమవుతుంది. మూడు కూడా పెద్ద జిల్లాలు కాబట్టి మరో మంత్రి పదవి వస్తుంది. అందుకే ఈ మూడు జిల్లాల్లో పలువురు సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు, జూనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశ పెట్టుకుని ఉన్నారు. సీనియర్లు ఏమో తమ సీనియారిటీ బట్టి పదవి వస్తుందని చూస్తుండగా, తమ పనితీరు బట్టి పదవి ఇస్తారని జూనియర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి చూడాలి జగన్ బంపర్ ఆఫర్ ఎవరికి ఇస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: