వాయు కాలుష్యం వల్ల జీవ కోటికి మనుగడ అనేది ఉండడం లేదు. ఎదో ఒక రూపంలో ప్రకృతిని కాలుష్యం అనే మహమ్మారి కబళించేస్తుంది. ఈ కాలుష్య మహమ్మారి  దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు దేశాలలోని ప్రజల్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఈ వాయు కాలుష్యం దేశ రాజధానిలో మరి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకనే ఢిల్లీలో ప్రజలు వాయు కాలుష్యంతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాయు కాలుష్యం వల్ల ఒక మానవుని కే కాదు సమస్త జీవకోటికి కూడా ప్రమాదమే.ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫిలిప్స్‌ ఇంట్లో అమర్చే ఎయిర్‌  ప్యూరిఫయర్స్‌ను మార్కెట్లోకి  విడుదల చేసింది.



కొత్తి ఫిలిప్స్‌ అర్బన్‌ లివింగ్‌ సిరీస్‌ ఎయిర్‌ ప్యూరిఫైయర్లను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది.ఇకపోతే ఈ ప్యూరిఫైయర్లు 3 సిరీస్‌లో అందుబాటులో కలవు. సిరీస్  1000, సిరీస్‌ 2000i , సిరీస్‌ 3000i   అనే మూడు   సిరీస్‌లలో లభించనుంది. ఇక ధర విషయానికి వస్తే ప్యూరిఫైయర్‌ ధర రూ.17,500 నుంచి మొదలవుతుంది. ఈ ప్యూరిఫైయర్  మొత్తం నాలుగు రకాల కొత్త
వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.  అధునాతన టెక్నాలజీతో  డిజైన్‌ చేసిన ప్యూరిఫైయర్లు గదిలో అతి తక్కువ సమయంలోనే గాలి ప్రసరణకు సహాయపడతాయి. దీనితో వాయు కాలుష్యం అనేది తగ్గుతుంది. ఇవి గాలిలోని వాయు కాలుష్యాన్ని తగ్గించి మనం పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గాలిని పీల్చుకునేలా చేస్తాయి.. !!

వాయు కాలుష్యం వల్ల శ్వాస కోశ సమస్యలు వస్తాయి. అలాగే ఈ కాలుష్యం అనేది మానవుని ఊపిరితిత్తులు, గుండె
, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.  అందుకనే  ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపనీ అయిన ఫిలిఫ్స్ ఈ ఎయిర్‌ పొల్యూషన్‌ ప్యూరిఫయర్స్‌ ని తయారు చేయడం జరిగింది. ఈ సదవకాశాన్ని ప్రజలు అందరు ఉపయోగించుకుంటే వాయు కాలుష్యం అనేది కొంచెం అన్నా తగ్గుతుంది.. !!  ప్రజలందరూ పరిశుభ్రమైన గాలిని పీల్చుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: