భారత్ పాకిస్తాన్ మధ్య  ఎప్పుడు శత్రుత్వం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కేవలం సరిహద్దుల్లోనే కాదు ఏ విషయంలో అయినా  భారత్-పాకిస్తాన్ దేశాన్ని దాయాది దేశంగానే  చూస్తూ ఉంటుంది. క్రికెట్ లో అయితే భారత ఆటగాళ్లు పాకిస్థాన్తో క్రికెట్ అంటే చాలు పూనకాలు వచ్చినట్లు అయిపోతారు అనే విషయం తెలిసిందే . ఆటగాళ్లు ఏకంగా  క్రికెట్ ఆడటం కాదు యుద్ధం చేస్తున్నట్లు గానే ఫీల్ అవుతుంటారు. ఆ రేంజిలో ఉంటుంది పాకిస్తాన్ భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే. దాదాపుగా పాకిస్తాన్ భారత్ జట్ల మధ్య క్రికెట్ జరుగుతుంది అంటే సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుంది అనే విధంగానే ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు.



 ఆటగాళ్లు కూడా ఇలాంటి ఆలోచనతోనే ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. పాకిస్తాన్ వ్యవహరించిన తీరుతో విసిగిపోయిన భారత్ పాకిస్థాన్తో క్రికెట్ ను పూర్తిగా నిషేధించిన  విషయం తెలిసిందే. 2008 తర్వాత భారత జట్టు ఒక్క సారి కూడా పాకిస్థాన్లో పర్యటించలేదు . 2012లో మాత్రం పాకిస్తాన్ భారత్ లో టి20 సిరీస్ లో పాల్గొంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్లో ద్వైపాక్షిక సిరీస్ ఆడ వద్దు అని భారత ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పడికి కూడా ఇదే కొనసాగుతోంది.




 అయితే 2021 సంవత్సరం లో టి20 వరల్డ్ కప్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఇక టీ20 వరల్డ్ కప్ కీ  భారత్ ఆథిద్యం  ఇచ్చేందుకు సిద్ధమైంది. టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు కూడా ఆడుతుంది  అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా అయితే పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చేందుకు వీసాల  అనుమతి ఉండదు అనే.  ఇక  టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందికీ వీసాల  విషయంలో హామీ ఇస్తేనే తాము టి20 వరల్డ్ కప్ లో పాల్గొంటాము  అంటు ఇటీవలే ఓ పేచి  పెట్టింది పాకిస్తాన్. దీనిపై భారత్  ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: