కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం  అభివృద్ధిలో పరుగులు పెట్టడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని   రూపుమాపడానికి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మోడీ సర్కార్. ఈ క్రమంలోనే కరోనా  వైరస్ సంక్షోభంలో కూడా సంక్షేమం దిశగా అడుగులు వేసిన మోడీ సర్కార్ ఆత్మ నిర్బర్  భారత్ పేరుతో... ఎన్నో ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తూ ప్రజలందరికీ చేయూతనిస్తూ.. అన్ని రకాల సంస్థలకు కూడా అండగా నిలబడుతున్న  విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో మహత్తర ఘట్టానికి కూడా సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం.



 ఇటీవలే నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన సంచలనంగా మారిపోయింది. ఏకంగా దేశం లో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు  ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీంతో ప్రస్తుతం భారత ప్రజలందరిలో  ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. సాధారణంగానే నితిన్ గడ్కరీ ఏదైనా చెప్పారు అంటే అది చేసి చూపిస్తారు అన్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాచరణపై.. ఆచరణ పై కూడా అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి నమ్మకాన్ని ఉంచుతారు.




 చెప్పిన ప్రతి విషయాన్ని ఆచరణలో సాధ్యం చేసి చూపిస్తారు  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ  ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు సాగుతున్నామని చెప్పడంతో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. అస్సాంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ దేశంలోనే మొదటిది ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందట. ఇక ఈ పార్క్ కి వాయు జల రోడ్డు రైలు రవాణా మార్గాలను కూడా ఏర్పాటు చేయనున్నారట. ఒకవేళ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ పూర్తి అయితే ఏకంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: