మరి కొన్ని రోజుల్లో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. జిహెచ్ఎంసి ఎన్నికల కోసం అటు తెలంగాణ ఎన్నికల సంఘం కూడా సర్వం సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ జిహెచ్ఎంసి ఎన్నికలను తీసుకుంది. గత ఎన్నికలలో లాగానే ఈ ఎన్నికల్లో కూడా విజయఢంకా మోగించి భారీ మెజారిటీ సాధించాలని ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా పావులు కూడా కదుపుతుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. అటు కాంగ్రెస్ పార్టీ కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో  గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.




 ఇక ముఖ్యం గా బిజెపి పార్టీ వ్యవహారమే జిహెచ్ఎంసి ఎన్నికల్లో  కూడా మరోసారి హాట్ టాపిక్ గా మారిపోతుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని విధంగా నాలుగు సీట్లు గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లు గానే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీ సాధిస్తామని బిజెపి ఇప్పటికే చెబుతుంది కూడా. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే సరికొత్త చర్చ తెరమీదకు వచ్చింది. త్వరలో జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో.. బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది అన్న ప్రచారం మొదలైంది.




 ఏపీలో ఇప్పటికే బీజేపీ జనసేన పార్టీలు కలిసి ముందుకు నడుస్తున్న విషయం తెలిసిందే. అదే పొత్తును  తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగించాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇక కిషన్రెడ్డి సారథ్యంలో బండి సంజయ్ నేతృత్వంలో.. తెలంగాణలో కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో .. బిజెపి జనసేన పార్టీలు కలిసి వ్యూహాత్మకంగా ముందుకు సాగే అవకాశం ఉందని ప్రస్తుతం ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే... జనసేన బిజెపి జిహెచ్ఎంసి ఎన్నికల్లో సత్తా చాటుతుందా  లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అంతే  కాకుండా బీజేపీ జనసేన పొత్తు తెలంగాణ జిహెచ్ఎంసి ఎన్నికల్లో  ప్లస్ గా మారుతుందా మైనస్  అవుతుందా అన్నది  కూడా ఆసక్తికరంగా మారింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: