భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల  నేపథ్యం లో భారత్ ఊహాత్మకం గా ముందుకు వెళుతూ చైనాకి వరుసగా షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంతం గా ఉన్న సరిహద్దులను చైనా  ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో... చైనాతో ప్రస్తుతం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎన్నోరకాలుగా యుద్ధం చేస్తుంది భారత్. ఈ క్రమంలోనే భారత్-చైనా పై ఆర్థిక యుద్ధం కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచం లోనే అతి పెద్ద మార్కెట్ ని కలిగి ఉన్న భారత్ నుంచి క్రమక్రమంగా చైనాను నిషేధిస్తూ వస్తుంది భారత ప్రభుత్వం. దీని కోసం ఎంతో వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తుంది.



 ఇప్పటికే చైనా కు సంబంధించిన యాప్స్ అన్నింటిని  నిషేధించిన భారత ప్రభుత్వం... ఇక ఆ తర్వాత చైనా కు సంబంధించిన అన్ని కాంట్రాక్టులను భారత్ లో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక భారత్ వ్యూహాల తో  చైనాకు ఆర్థికంగా గట్టి దెబ్బ తగులుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక పూర్తిస్థాయిలో భారత్ నుంచి చైనా ను నిషేధించాలని భావిస్తున్న భారత్... మరోసారి చైనాను మరింత ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి పదునైన వ్యూహానికి సిద్ధమైంది.



 చైనా నుంచి భారత్ దిగుమతి అవుతున్న మొబైల్ ఫోన్లలో భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయి అనే ఆరోపణ తెర మీదికి తెచ్చిన భారత ప్రభుత్వం.. స్వదేశీ  సెల్ ఫోన్ తయారీ కంపెనీ లైన మైక్రోమాక్స్.. లావా లాంటి పలు కంపెనీలను అభివృద్ధి చేసేందుకు ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలోని అమెరికా టెలికం కంపెనీలు భారత టెలికాం కంపెనీల తో టైఅప్  అయ్యేందుకు  చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా అటు చైనా పై ఆధిపత్యం సంపాదించాలనే  అమెరికా వ్యూహం పలించడం తో పాటు భారత స్వదేశీ మార్కెట్ కూడా మరింత బలపడుతుందని ప్రస్తుతం ఇలా భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: