దేశంలో తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ పెరిగాయి‌. దేశంలో కొత్తగా 55వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ  బాధితుల సంఖ్య పెరుగుతోంది. వ్యాక్సిన్ త్వరగా వచ్చే అవకాశం లేకపోవడంతో.. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో కరోనా కేసులు తగ్గే పరంపరకు బ్రేక్ పడింది. గత 24 గంటల్లో దేశంలో 55 వేల 839 కొత్త కేసులు వచ్చాయి.  అటు మరణాల సంఖ్య కూడా పెరిగింది. కొత్తగా మరో 702 మంది కరోనా కాటుకు బలయ్యారు.  కొత్త కేసులతో భారత్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 77 లక్షలు దాటింది. మొత్తం బాధితుల సంఖ్య  77 లక్షల 6 వేల946కి చేరింది. దేశంలో ఇప్పటి వరకు లక్షా 16 వేల 616 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం 7 లక్షల 15 వేల 812 యాక్టివ్‌ కేసులున్నాయి‌. భారత్‌లో ఇప్పటివరకు 9.86 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఏపీలో ఒక్కరోజులో  76 వేల 726  కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3 వేల 620 కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.16 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7లక్షల 96వేల 919కు చేరింది. 6వేల 524 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32వేల 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో గడిచిన 24గంటల్లో 14 వందల 56 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 27వేల 580కి చేరింది. ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 12 వందల 92కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20వేల 183 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ.

అయితే నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుతుండటం కూడా కొత్త కేసుల పెరుగుదలకు కారణం కావచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: