కరోనా వైరస్ వచ్చి ఇప్పటికే 8 నెలలు గడుస్తోంది, అయినా ప్రపంచ దేశాలను విడిచి పెట్టను అంటూ తన విజృంభన కొనసాగిస్తోంది.... కరోనా పుట్టినిల్లు చైనా పై ప్రపంచదేశ ప్రజలు కారాలు మిరియాలు నూరుతున్నారు.... అసలు కరోనా వైరస్ దాని అంతట అదే ఉద్భవించిందా  లేక కావాలని ప్రపంచ దేశాలు మీదకు తయారుచేసి వదిలిందా అన్న విషయం స్పష్టం కాకపోయినా... ఎక్కువ శాతం మంది ప్రజలు చైనా  కరోనా వైరస్ ను తయారు చేసి ప్రజల మీదకు విసిరి తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోందని  విమర్శలు చేస్తూనే ఉన్నారు..... అగ్రదేశం అమెరికా అయితే ఈ వైరస్  విషయంలో సమయం దొరికినప్పుడల్లా డ్రాగన్ దేశంపై విమర్శల బాణాలు విసురుతోంది.ప్రపంచదేశాలతో పోల్చితే వర్ధమాన అభివృద్ధి చెందుతున్న బ్రెజిల్ దేశం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. 

ఈ దేశ అధ్యక్షుడు బోల్సోనారో మొదట కరోనా లేదు గిరోనా లేదంటూ మాస్క్ పెట్టుకోకుండా అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ స్వేచ్ఛగా తిరిగారు.. ఆ తర్వాత కరోనా బారినపడ్డాడు... దేశమంతా కరోనా బారిన పడతామేమో అని  ప్రజలు చెప్పలేని భయంతో..... ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వ్యాక్సిన్ వచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికా భారత్ తర్వాత అత్యధిక వ్యాప్తి ఇప్పుడు బ్రెజిల్ దేశంలోనే  ఉంది. చైనా దేశంతో బ్రెజిల్ కు సత్సంబంధాలు ఉన్నాయి. చైనా కంపెనీ సినోవిక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసేందుకు బ్రెజిల్ దేశం భారీ ఆర్డర్ ఇచ్చింది. ఏకంగా 4.6 కోట్ల వ్యాక్సిన్ కొనుగోలుకు అన్ని రకాల ప్రణాళికలు రచించింది... కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కానీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసనలు చేస్తూ ఈ వ్యాక్సిన్ కొనుగోలును అడ్డుకున్నారు. చైనా వ్యాక్సిన్ లు మాకొద్దు బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రజల ఆందోళన స్థాయి పెరుగుతుండడంతో కిందకి దిగి వచ్చింది బ్రెజిల్ దేశం..బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో  సంచలన నిర్ణయం తీసుకున్నారు.

బ్రెజిల్ దేశ ప్రజల్లో ఆగ్రహం ఆకాశాన్ని అంటుతోంది. కరోనా వైరస్ ను అంటించిన చైనా దేశం నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేయడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. చైనా వ్యాక్సిన్ కొనవద్దంటూ ఆ దేశ ప్రజలు సోషల్ మీడియాలో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోకు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు . పెద్ద ఎత్తున విన్నవించారు. దీనికి బ్రెజిల్ అధ్యక్షుడు  సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 4.6 కోట్ల చైనా వ్యాక్సిన్ ఆర్డర్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో చైనాపై బ్రెజిల్ లో జరుగుతున్న ప్రజా ఉద్యమం తగ్గి యదా స్థితికి చేరుకుంది. బుటంటాన్ అనే వ్యాక్సిన్ ను బ్రెజిల్ సొంతంగా తయారు చేస్తోందని.. ప్రజలకు సరఫరా చేస్తామని బ్రెజిల్ ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. మరోవైపు ప్రపంచ దేశాలు కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం సాయశక్తులా కృషి చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: