కరోనా ప్రభావం అందరినీ భయపడేలా చేసింది. ఎవరు విచ్చల విడిగా రోడ్లపై తిరిగేందుకు ఇష్టపడడం లేదు. గతంతో పోలిస్తే, అంతా ఇప్పుడు సెట్ రైట్ అయిపోయారు. ముఖ్యంగా ఎప్పుడూ జనాల్లో ఉండే నాయకులు సైతం కరోనా దెబ్బకు ఇన్లు కదిలేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక పని రాక్షసుడిగా పేరున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ కరోనా ఒకరకంగా మేలు చేయగా, మరో రకంగా కీడును చేసింది. ఇప్పటి వరకు 40 ఏళ్ల రాజకీయ జీవితం అంటూ చెప్పుకుంటూ చంద్రబాబు హడావుడి చేస్తూ, ఉద్యమాలు, ఆందోళనలు అంటూ తాను క్షణం ఖాళీ ఉండకుండా, పార్టీ నాయకులు ఎవరూ ఉండకుండా, నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ చంద్రబాబు హడావుడిగా కనిపిస్తూ ఉండేవారు.


2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబును సైతం పార్టీ నాయకులు ఎవరు లెక్క చేసే పరిస్థితి లేదు. దీనికి తోడు కరోనా వైరస్ ప్రభావం జనాల్లో ఎక్కువగా ఉండడంతో, వారు సైతం రాజకీయాలను పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు క్షణం తీరిక లేకుండా పార్టీ కోసం నిరంతరం కృషి చేశారు. ఇప్పుడు ఆయన వయస్సు 70 సంవత్సరాలు దాటిపోయింది. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేదు. మొన్నటి వరకు చంద్రబాబు సైతం హైదరాబాద్ లోని తన నివాసానికే పరిమితం అయిపోయారు. దీంతో పార్టీ శ్రేణులు అంతా మరింత భయాందోళనకు గురి అవుతూ, తమకు నచ్చిన పార్టీలో చేరిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీలో నిరాశా, నిస్పృహలు అలుముకున్నాయి.


 పెద్దఎత్తున వలసలు సైతం జోరు అందుకోవడంతో చంద్రబాబు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పార్టీలో కొత్త కమిటీలను నియమించారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ పార్టీలో మరింతగా యాక్టివ్ అవుతూ, గతంలో ఎప్పుడూ లేని విధంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ, రైతులను పరామర్శిస్తూ, పంట నష్టాన్ని పరిశీలిస్తూ, ఎలా మరింత యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు మాత్రమే కాదు, ఆ పార్టీలోని సీనియర్ నాయకులు అంత ఇప్పుడు సైడ్ అయిపోయినట్టే కనిపిస్తున్నారు. ముందు ముందు మరింతగా, యాక్టివ్ గా ఉంటూ, జనాల్లో తిరిగే విధంగా లోకేష్ ప్లాన్ చేసుకుంటూ చంద్రబాబు స్థాయి వ్యక్తిని  తానే అనే సంకేతాలను లోకేష్ పంపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: