జగన్ ఏ పని మొదలుపెట్టినా అది ఆషామాషిగా ఉండదు. ముందుచపుతో ఆలోచించి మరీ జగన్ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కారణంగానే ఆయన ప్రజల హృదయాలను గెలుచుకోగలిగారు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని బలహీనం చేసే విషయంలోనూ జగన్ సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో జగన్ తీసుకున్న నిర్ణయాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి  పై ప్రధాన న్యాయమూర్తి కి లేఖ రాయడం నిజంగా ఒక సాహసమనే చెప్పాలి. రాజ్యాంగ వ్యవస్థలను ఈ విధంగా ఇరుకున పెట్టే విధంగా జగన్ ప్రయత్నించారని సీఎం పదవి ఊడిపోవడం ఖాయమని కూడా ఇప్పుడు వార్తలు జోరుగా వస్తున్నాయి. 



జగన్ జైలుకు  వెళ్తారనే జోష్యాలు ఎన్నో ఎందరో చెబుతూ వస్తున్నారు. ఏదైనా తేడా వస్తే, ఇటువంటి వ్యవహారాలు అన్నీ తన మెడకు చుట్టుకుంటాయి అనేది జగన్ కు సైతం బాగా తెలుసు. అయినా లెక్క చేయకుండా, ఈ విషయంలో ముందుకు వెళ్లడం వెనుక, కారణాలు చాలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ పై అక్రమ ఆస్తుల కేసు పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం రోజువారీ విచారణ ఇప్పుడు మొదలైంది. ఏడాదిలోగా,  జగన్ పైన అన్న కేసు విచారణ పూర్తవుతాయి. ఈ కేసులో జగన్ నిర్దోషిగా బయటకు వస్తారని వైసిపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు.



 ఒకవేళ అనుకూలంగా తీర్పు రాకపోతే, జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అంటే ఆయన సీఎం పదవి కూడా పోతుంది.  ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తి పైన లేఖ రాయడం , ఇందులో ఏదైనా తేడా వస్తే జగన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావడమే కాకుండా, అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ జగన్ కు బాగా తెలుసు.  అయితే అన్ని వ్యవస్థల్లోనూ, బాబు మనుషులు ఉన్నట్లే, న్యాయవ్యవస్థలో ను బాబు మనుషులు ఉన్నారు అనే అభిప్రాయం జనాల్లో కలుగజేస్తూ, ఒకవేళ తాను అరెస్టు అయినా, సునాయాసంగా గెలవచ్చు అనేది జగన్ ప్లాన్ గా కనిపిస్తోంది. అందుకే ఈ విధంగా జగన్ ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది.



ReplyForward

















auto 0px; padding-bottom: 16px; width: 20px; user-select: none;'>











Compose:

IHGIHGIHG

మరింత సమాచారం తెలుసుకోండి: