బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ బిజెపి తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో బి.జె.పి కూటమి అధికారంలోకి వస్తే బీహార్ అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరచడం తో ఈ అంశంపై తమ ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నారు.  ప్రాణాలను కాపాడే కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం, ఎన్నికల్లో ఓట్లకు ముడిపెడతారా అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై బీహార్‌లో ప్రతిపక్షాలు మండిపడుతుంటే ఇప్పుడు మరో నేత కూడా బీజేపీపై ధ్వజమెత్తారు.


మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ మంత్రిగా కొనసాగిన అకాలీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కరోనా వ్యాక్సిన్‌ను వినియోగించుకోవడం అనైతికమని వ్యాఖ్యానించారు. ‘ఫ్రీ వ్యాక్సిన్ బీహార్ కేనా? ఇది హాస్యాస్పదం. అంటే, దేశంలో ఇతర ప్రాంతాలు ట్యాక్స్‌లు కట్టడం లేదా? వాళ్లు భారత పౌరులు కాదా? కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ అందించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది. ప్రాణాలు నిలబెట్టే వ్యాక్సిన్‌ను ఓట్లు పొందే సాధనంగా వాడుకోవడం పూర్తిగా అనైతికం.’ అని హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ట్వీట్ చేశారు.



గత నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు బిల్లులను వ్యతిరేకిస్తూ అకాళీదళ్ ఎన్డీయే నుంచి తప్పుకొంది. కేంద్రం తెచ్చిన బిల్లులకు నిరసనగా హర్యానా, పంజాబ్‌లో రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఈక్రమంలో ఎన్డీయే నుంచి అకాళీదళ్ తప్పుకొంది. హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్రమంత్రి పదవి నుంచి తప్పుకొన్నారు. మొదట బిల్లులను సమర్థించిన అకాళీదళ్ మధ్యలో తమ వైఖరిని మార్చుకుంది. ఫ్రీ వ్యాక్సిన్ అంశంతో స్వార్థపూరిత రాజకీయాలకు బిజెపి తెరలేపింది అంశం అర్థం అవుతుంది. దేశం మొత్తం కరోనా వాక్సిన్ కోసం ఎదురుచూస్తుంటే.. బీహారి లికె ఉచిత వ్యాక్సిన్ అనడం ఎంత వరకు సమంజసమని అంటున్నారు. ఎన్నికల వేళ ప్రజల ప్రాణాలతో రాజకీయాలు చేయడం మానేయాలని ప్రతి పక్షాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: