మళ్ళీ ఏపీలో పాత కధ రిపీట్ అయ్యేలా ఉంది. ఈసారి వారు వీరు అవుతున్నారు అంతే తేడా. ఏపీలో మరోమారు అధికార పార్టీకి, రాజ్యంగ బద్ధ సంస్థకు మధ్య పేచీ వచ్చేలా సీన్ అయితే కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలకు పచ్చ జెండా ఊపేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ జోరు మరింత పెంచారు. ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఆయన ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మెజారిటీ పార్టీలు ఎలా చెబితే అలా నిర్ణయం తీసుకుంటారు.

మొత్తం మీద చూసుకుంటే స్థానిక ఎన్నికలను నవంబర్లో నిర్వహించడానికి నిమ్మగడ్డ ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. కానీ జగన్ సర్కార్ మాత్రం ఎన్నికలు ఇప్పట్లో వద్దు అనుకుంటోంది. ఇది నిజంగా చిత్రమైన వ్యవహారమే. నాడు అంటే మార్చిలో ఎన్నికలను ఎందుకు అర్ధాంతరంగా వాయిదా వేశారు అని వైసీపీ సర్కార్  ఎస్ ఈసీ మీద గుస్సా అయింది. అయితే  ఇపుడు ఎందుకు ఎన్నికలు అంటూ గుస్సా అవుతోంది.

అదే సమయంలో నిమ్మగడ్డ సైడ్ నుంచి చూసుకుంటే మార్చిలో ఎన్నికలు వాయిదా వేశారు. దానికి కరోనా ప్రభావం కారణంగా చెప్పుకొచ్చారు. కానీ ఇపుడు రోజుకు మూడు వేల వరకూ కేసులు వస్తున్నా కూడా ఎన్నికలకు వెళ్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కరోనా ఇప్పట్లో తగ్గదు. అలాగని ఎన్నికలు ఎన్నాళ్ళు వాయిదా వేసుకుంటామని మరో వైపు వాదన కూడా వినిపిస్తోంది.  మరి మార్చికి, నవంబర్ కి మధ్య ఎనిమిది నెలలు గడచాయి. అటు చూస్తే అధికార పార్టీ, ఇటు ఎస్ఈసీ స్టాండ్స్ మళ్లీ మారాయి. దాంతో కొత్త పేచీ వచ్చేలా కనిపిస్తోంది. చూడాలి మరి ఈ నెల 28న ఎస్ఈసీ ఎటువంటి కీలకమైన  నిర్ణయం తీసుకుంటుందో. ఏది ఏమైనా ఏపీలో ఎన్నికలు జరిపించి తీరాలని ఎస్ఈసీ పట్టుదల మీద ఉందని స్పష్టమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: