ఈ మధ్యకాలం లో ఎక్కడ చూసినా దొంగల బెడద ఎక్కువైపోతుంది అన్న విషయం తెలిసిందే. సాధారణం గా ఉద్యోగం చేసి వచ్చిన జీతంతో జీవితాన్ని గడపడం కంటే దొంగతనాల కు పాల్పడి భారీగా దోచేసిన డబ్బుతో జల్సాలు చేయడమే ఎంతో బెటర్ అని భావిస్తున్న ఎంతో మంది దొంగలు గా మారిపోయి ఎన్నో ఇళ్లకు  కన్నాలు  వేస్తూ భారీగా డబ్బులు దోచుకుంటున్న  విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా దొంగల బెడద రోజు రోజుకు ఎక్కువవుతోన్న  తరుణం లో దొంగలను పట్టుకోవడం పోలీసులకు కూడా సవాల్ గా మారిపోతుంది.



 ఇక దొంగలు పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు ఎంతో వినూత్నంగా ఆలోచించి  దొంగతనాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది దొంగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లకు కన్నాలు వేసి చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతుంటే..  మరికొంతమంది మాత్రం దొంగతనాలు చేస్తే లైఫ్ సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో  ఏమో.. భారీ  దొంగతనాలకు పాల్పడుతూ అందరికీ షాక్ ఇస్తున్నారు. ఒకేసారి కోట్లకి కోట్లు కొల్లగొడుతు... పోలీసులకు సవాల్ విసురుతున్నారు దొంగలు. ఇటీవలే ఇలాంటి దొంగతనం జరిగింది.



 సాదా సీదా దొంగతనం ఎన్నిసార్లు చేస్తాములే అనుకున్నారో ఏమో... ఏకంగా 15 కోట్ల దొంగతనం చేశారు దొంగలు. సెల్ఫోన్ లోడుతో చెన్నై నుంచి ముంబై వెళుతున్న ఓ లారీని అడ్డగించిన వ్యక్తులు అందులోని సెల్ఫోన్లను దొంగలించారు. 15 వేల కోట్ల విలువ చేసే 14400 సెల్ఫోన్లను దొంగలించారు. లారీని అడ్డగించి లారీ డ్రైవర్ క్లీనర్ల కాళ్లు చేతులు కట్టేసి ఈ చోరీకి యత్నించారు దొంగలు. లారీని అడ్డగించి సెల్ఫోన్ లోడు  ఉన్న లారీని తమతోపాటు తీసుకెళ్లి 8 కిలోమీటర్ల దూరంలో ఆ లారీని  అక్కడే వదిలేసి అందులోని సెల్ఫోన్ లన్నింటినీ దోచుకెళ్లారు. లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: