కరోనా పుణ్యమా అని ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా, చక్కగా ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునే వారికి ఇంటి నుండి పని చేసుకోవడం అనే వెసులుబాటును కల్పించాయి కంపెనీలు మరియు ప్రభుత్వం. దీనివలన ఎంతోమంది చాలా ఒత్తిడికి గురవుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఒక ఉద్యోగి తీవ్ర ఒత్తిడి వలన మృతి చెందారు.  ఒకప్పుడు అందరూ ఆఫీసులకు వెళ్లి పని చేసుకుని, సాయంత్రం కుటుంబంతో సమయాన్ని గడిపేవారు. కానీ ఇప్పుడు విధానం పూర్తిగా మారిపోయింది.

ఆఫీస్ టెన్షన్ లు అన్నీ ఇంటి దగ్గరే ఉండడంతో కుటుంబసభ్యులపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఇప్పుడు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒత్తిడి తట్టుకోలేక ఓ నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్ లోని అదాజన్ కు చెందిన జిగర్ గాంధీ అనే వ్యక్తి నోయిడాలోని ఓ కంపెనీలో గత మూడు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. దాదాపు రెండు నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వహిస్తున్నాడు. పని ఒత్తిడి కారణంగా కొద్దిరోజులుగా ముభావంగా ఉంటున్నాడు.

సదరు ఉద్యోగి ఈ ఒత్తిడి వలన తాను పడుతున్న బాధ గురించి కుటుంబ సభ్యులకు చెబుతూనే ఉన్నాడు. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో మంగళవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై అదాజన్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. గత డిసెంబర్లో అతడి ఎంగేజ్ మెంట్ రద్దయింది. ఇక అప్పటినుంచి డిప్రెషన్లో ఉన్నాడు. దానికి తోడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒత్తిడి కూడా మొదలైంది. అతడికి సన్నిహితంగా ఉండే ఇద్దరు వ్యక్తుల్ని ఆత్మహత్యకు ముందు రోజు ఇంటికి పిలిపించుకుని ఆ రాత్రంతా వారితో సరదాగా గడుపుదామనుకున్నాడు. కానీ అలా జరగలేదు. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: