ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిపోయాయి. అయితే సీతాకాలం సమయంలో కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా పంట నష్టం వాటిల్లి రైతులందరూ తీవ్ర నిరాశలో మునిగి పోయిన విషయం తెలిసిందే.  అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో నగరాల పరిస్థితి అయితే మరింత అధ్వానంగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు దుర్భర స్థితిలో కి వెళ్లిపోయి జలదిగ్బంధంలోనే బతుకుబండిని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద పరివాహక ప్రాంతాల పరిస్థితి అయితే మరింత అధ్వానంగా మారిపోయింది.



 భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులన్నీ పొంగిపోవడం తో ఎక్కడికక్కడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలందరూ జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయి.. ఆవాసాలు  కోల్పోయి దుర్భర స్థితిని గడిపారు. ఇక అధికారులు వరద పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు తీవ్ర కసరత్తులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నే తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ బెంబేలెత్తి పోతే ఆ తర్వాత కూడా మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలందరూ బెంబేలెత్తి పోయిన విషయం తెలిసి ఉంటుంది.




 ఇక ఇటీవలే తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు శుభవార్త చెప్పారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి ఇక ఇప్పుడు బలపడి వాయుగుండంగా మారింది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది దక్షిణ ఓడిశా ఉత్తరాంధ్ర సమీపాన వాయువ్య బంగాళాఖాతంలో  పశ్చిమ మధ్య ప్రాంతానికి ఆనుకొని ఉందని.. అయితే ఈ వాయుగుండం దిశను మార్చుకోవడం తో బెంగాల్ బంగ్లా దేష్  వైపుగా ప్రయాణం అవుతుందని దీంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు నుంచి ముప్పు తప్పింది అంటూ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: