ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ చక్రం తిప్పాలని భావిస్తుంది కాబట్టింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరముంటుంది. నాయకత్వ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నాయకుల విషయంలో కూడా బిజెపి నేతలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అనేది ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోని ముందుకు వెళ్తే అనవసరంగా ఇబ్బందులు రావచ్చు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు చాలా మంది నేతలు ఇబ్బందులు పడుతున్నారు.

ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందో లేదో అనేది మాత్రం చాలామందికి స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో నాయకత్వం నాయకుల్లో భరోసా కల్పించాల్సిన అవసరం అనేది ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతలు మాత్రం ఇప్పుడు కాస్త వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు వ్యవహారశైలిపై తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ఆయన ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నారు. తాజాగా పార్టీ నుంచి టీవీ డిబేట్ లో పాల్గొన్నారని లంకా దినకర్ ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో బిజెపి పార్టీ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు.

అసలు బిజెపిలో సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత ఒక్కరు కూడా రాలేదు. దీంతో ఆయనపై తీవ్రస్థాయిలో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అనవసరంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పార్టీ వాయిస్ వినిపించడానికి ఎవరూ ఉండరని మీడియాతో మాట్లాడే నేతలు కూడా కరువు అవుతారని కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా ఇబ్బందులు ఉంటాయని ఏదైనా ఉంటే వార్నింగ్ ఇచ్చి సరిపెట్టాలి కానీ ఇలాంటి చర్యలు తీసుకుంటే లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అని హెచ్చరిస్తున్నారు. మరి సోము వీర్రాజు ఎలా ముందుకు వెళ్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: