ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు బయటకు వెళ్తారు అనే వార్తలు గత కొద్దిరోజులుగా వినబడుతూనే ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ గంటా శ్రీనివాసరావు  మాత్రం ఇప్పుడు అసలు స్పందించడం లేదు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఏదో ఒక పార్టీ లోకి వెళ్ళే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అని రాజకీయంగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆయనకు బిజెపి నేతలు మాత్రం గాలం వేశారు అని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది.

బీజేపీ నేతల్లో చాలామంది ఆయనను తమ పార్టీలోకి తీసుకోవడానికి గట్టిగానే కష్టపడుతున్నారు. అయితే ఏ పార్టీ లోకి వెళ్ళకుండా కాస్త గంటా శ్రీనివాసరావు అటు ఇటు గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు చూస్తే గంటా శ్రీనివాసరావు మాత్రం వైసీపీ లోకి వెళ్లే అవకాశాలు లేవు అనే భావన వ్యక్తమవుతోంది. దానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఒకసారి చూస్తే... తాను రాజీనామా చేస్తానని కాబట్టి మళ్లీ అదే నియోజకవర్గం నుంచి తనకు సీటు ఇవ్వాలని తనను మంత్రివర్గం లోకి తీసుకోవాలని గంటా శ్రీనివాసరావు కోరారు.

అయితే మళ్లీ ఎన్నికల కోసం వైసీపీ ఇప్పుడు సిద్ధంగా లేదు.  అందుకే గంటా శ్రీనివాస రావు వద్దు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. అవసరమైతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తామని వైసిపి చెప్పినట్లుగా సమాచారం. అయితే శాసన మండలి ఎప్పుడు రద్దు అవుతుందో తెలియదు. కాబట్టి అనవసరంగా తనకు ఏ పదవి లేకుండా పోతుందని కాబట్టి తనను మళ్లీ అదే నియోజకవర్గం నుంచి గెలిపించే విధంగా అయితే తాను వైసీపీ లోకి వస్తాను అని చెప్పినట్లుగా సమాచారం. మరో మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఇప్పుడు గంటా శ్రీనివాస రావుని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: