ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం జగన్ కు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కొన్ని కొన్ని పరిణామాలు మాత్రం ఆయనను ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎలాగో బలపడే అవకాశం లేదు. ఇప్పటికే ఆ పార్టీకి ఎలాంటి అవకాశాలు లేవు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం విజయం కోసం తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో కష్టపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది.

అటు వైసీపీ కూడా వస్తున్న ఎన్నికల మీద కాస్త ఎక్కువగానే కష్టపడుతుంది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటి అనేది తెలియకపోయినా వైసీపీ నేతలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అంటి ముట్టనట్టు గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. చాలామంది స్థానిక నాయకులు ప్రజల్లోకి వెళ్లడం లో కాస్త ఇబ్బందులు పడుతున్నారు. దీనితో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

ఇప్పటివరకు సీఎం జగన్ కు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం సరికొత్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమై ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాలి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ మాత్రం బలపడిన సరే అనవసరంగా కొన్ని కొన్ని పరిణామాలు ఎదుర్కోవడానికి వైసిపి సిద్ధంగా ఉండాలి. అటు బీజేపీ కూడా ఎవరితో సావాసం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉంది. తెలుగుదేశం పార్టీకి బిజెపి కి మధ్య దగ్గర సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే వారు. విమర్శలు చేసుకున్న సరే ముందు నుంచి కూడా సహజ మిత్రులు అనే సంగతి మర్చిపోకుండా వైసీపీ ముందుకు వెళ్ళాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: