దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మాత్రం ఏదో ఒక సంచలనం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ పార్టీకి గెలిచే అవకాశాలు మాత్రం ఏ విధంగా కూడా లేవు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయ పరంగా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. రెండు స్థానానికి ఎవరు వస్తారు అనేది చెప్పడం కాస్త కష్టంగా ఉంది. బిజెపి వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మరే స్థానం వస్తుందనేది త్వరలోనే స్పష్టత రానుంది. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ నేతలు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు.

బిజెపి రాష్ట్ర పార్టీ నేతలు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడం మనం చూస్తున్నాం. అయితే అవి ఎంతవరకు ఫలిస్తాయి ఏంటి అనేది తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మంత్రి హరీష్ రావు ని టార్గెట్ గా చేసుకుని భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు టిఆర్ఎస్ పార్టీ ని కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయంగా హరీష్ రావు చాలా బలమైన నేత. ఆయనను టార్గెట్ చేసుకుని ఇప్పుడు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా అప్రమత్తం అయినట్లు కనబడుతుంది.

మంత్రి హరీష్ రావు కి అండగా నిలబడాలని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచిస్తున్నారు. బీజేపీ చేసే ప్రతి ఒక్క విమర్శ కూడా తిప్పికొట్టాలని ఆయన నేతలకు స్పష్టం చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు బీజేపీ బలపడుతుంది కాబట్టి కొన్ని ఘాటు విమర్శలు చేసే అవకాశం ఉందని, అవి ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రులకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచిస్తున్నారు. మరో మంత్రి కేటీఆర్ కూడా హరీష్ రావు కి అండగా నిలబడాలని భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో సవాళ్లు కూడా చేసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: