తెలంగాణ పోలీసుల పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.. కరోనా ఒకవైపు , భారీ వర్షాలు మరో వైపు ఉన్నా కూడా ప్రజలను కాపాడటంలో పోలీసులు వెనకడుగు వేయలేదు.. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని సమర్థవతంగా ఎదుర్కొంటూ ప్రజలను కాపాడుతున్నారు. ప్రజలను కాపాడటంలో కొందరు కరోనా కాటుకు బలైయ్యారు.. అయిన ప్రజల శ్రేయస్సు కోసం అన్నీ వదులుకొని విధులను నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు మరోసారి గొప్ప పని చేసి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.



వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో ఓ నెల పసికందును కసాయి తల్లి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయింది. ఆ చిన్నారిని హక్కున చేర్చుకొని కొత్త బట్టలు కొని, నామకరణం కూడా చేశారు. ఈ ఘటన భాగ్యనగరం నడిబొడ్డు లో చోటు చేసుకుంది. నెలన్నర వయసు ఉన్న చిన్నారిని రోడ్డుపై వదిలి వెళ్ళిన ఘటన కూకట్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి 11 ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ ఆ చిన్నారిని కైత్ల పూర్‌ వెళ్లే దారిలో ఉన్నటువంటి పెట్రోల్‌ బంకు వద్ద వదిలేసి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.



 ఆ చిన్నారిని కాపాడిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పెట్రోల్ మొబైల్  అక్కడకు వెళ్ళింది. పసి పాపను పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారు. స్టేషన్ లోని మహిళా పోలీసులు ఆ చిన్నారిని శుభ్రం చేశారు. అనంతరం కొత్త బట్టలు వేశారు. అంతేకాదు ఆ చిన్నారిని కూకట్ పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి చేరదీసి ఇందిర అనే పేరును పెట్టారు. తర్వాత కూకట్ పల్లి చైల్డ్ లైన్ కు సమాచారం అందించారు. పసి పాప యోగక్షేమాలు చూసేందుకు శిశువిహార్‌ కి అప్పగించి పెద్ద మనసు చాటుకున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: