కరోనా  వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది పై పంజా విసురుతు ప్రాణాలు తీయడమే కాదు మరికొంత మందిని మానసికంగా చంపేస్తూ ఇక ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే పరిస్థితి లేదు అనే పరిస్థితులను తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది పై పంజా విసిరి ఆస్పత్రి పాలు చేయటమే కాదు ఎన్నో కుటుంబాలను రోడ్డుపాలు కూడా చేసింది ఈ మహమ్మారి. కరోనా  వైరస్ కారణంగా సంక్షోభం ఏర్పడి ఎంతో మందికి ఉపాధి కోల్పోయి కనీసం తినడానికి తిండి లేక అవస్థలు పడిన ఎన్నో సంఘటనలు తెర మీదికి వచ్చి ఎంతో మంది హృదయాలను కలచివేసిన  విషయం తెలిసిందే.



 ఇక ఉపాధిలేక కుటుంబ పోషణ భారమై మనస్తాపం చెంది ఎంతోమంది కరోనా  వైరస్ బారిన పడకుండానే ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా పరిస్థితిలో మార్పు రావడంలేదు. ఇక అంతే కాకుండా కరోనా  వైరస్  ఎంతో మందికి ప్రియమైన వారిని దూరం చేస్తున్న తరుణంలో... ప్రియమైన వారు లేని జీవితాన్ని ఊహించుకోలేక  ఎంతోమంది మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా తెర మీదకి వస్తున్న విషయం తెలిసిందే ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన చోటు చేసుకుంది.


భర్త లేని జీవితాన్ని భార్య ఊహించుకో లేకపోయింది. ఇటీవలే కరోనా  వైరస్ బారిన పడిన భర్త చికిత్స తీసుకుంటూ ఆరోగ్యం విషమించి చనిపోవడంతో భార్య కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన హైదరాబాదులోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్ కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఇటీవలే కరోనా  వైరస్ బారినపడి ఆరోగ్యం విషమించి మరణించాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక పోయింది భార్య ధనలక్ష్మి. దీంతో తాము నివసిస్తున్న బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: