ప్రస్తుతం ప్రపంచ దేశాలలోకెల్లా  అగ్రరాజ్యమైన అమెరికా ప్రపంచంలోనే కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో  నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ అమెరికాలో కరోనా వైరస్ మాత్రం కంట్రోల్ లోకి రావడం లేదు. అమెరికాలో కేవలం కరోనా  వైరస్ కేసుల సంఖ్య మాత్రమే కాదు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం అందరిలో  ఆందోళన కలిగించింది. అయితే అమెరికాలో మరికొన్ని రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు రాబోతున్న తరుణంలో కరోనా వైరస్ ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి డెమోక్రటిక్ అభ్యర్థి జో  బైడెన్  ప్రపంచంలోనే కరోనా  వ్యాప్తిలో అమెరికా అగ్రస్థానంలో ఉండటం పై ట్రంపు సర్కారుపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.



 ముఖ్యంగా ఓవైపు జో  బైడెన్ మరోవైపు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు తమదైన శైలిలో వాక్చాతుర్యం హామీలతో ఆకట్టుకునే పనిలో పడ్డారు. అయితే ఇప్పటికే ట్రంప్ డెమోక్రటిక్ అభ్యర్థి మధ్య రెండు దశల డిబేట్ కొనసాగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మూడో దశ ప్రెసిడెన్షియల్ డిబేట్  జరుగుతుంది. డిబేట్ లో  ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించూకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా  వైరస్ వ్యాప్తిని ప్రధాన కారణంగా చేసుకొని డెమోక్రటిక్ అభ్య ర్థిజో  బైడెన్ డోనాల్డ్ ట్రంప్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వైఫల్యం కారణంగానే కరోనా కేసుల్లో  అమెరికా మొదటి స్థానంలో ఉంది అంటూ విమర్శించారు.



 కరోనా వ్యాప్తి మొదట్లో  ట్రంప్  సర్కార్ ఆలస్యంగా స్పందించిందని ప్రస్తుతం ట్రంప్  సర్కారు అలసత్వం అమెరికా ప్రజల పాలిట శాపంగా మారి పోయింది అంటూ విమర్శించారు జో  బైడెన్. చైనాకు  రాకపోకలు విషయంలో ఆలస్యంగా స్పందించటం కారణంగానే కరోనా  వైరస్ కేసుల్లో  అమెరికా మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. వైరస్ ను  ఎదుర్కోవడంలో ట్రంప్  వద్ద ఎలాంటి ప్రణాళికలు కానీ వ్యూహాలు కాని లేవని.. అందుకే  వైరస్ నియంత్రణ చర్యల్లో  ట్రంపు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అంటూ విమర్శించారు జో  బైడెన్. ఇప్పటికే కరోనా మరణాలు రెండు లక్షలు దాటాయి అంటూ తెలిపిన జో  బైడెన్... మరణాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: