మన దేశంలో కరోనా వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉండవచ్చు అని పలువురు అంచనా వేస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం డిసెంబర్, జనవరి నెలల్లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో ఉండే అవకాశాలు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాకుండా ఫిబ్రవరిలో కూడా కరోనా కేసులు పెరగడం అనేది తీవ్ర స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.

ఇక మన దేశ వ్యాప్తంగా చూస్తే ముఖ్యంగా హిమాలయ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక కరోనా మరణాలు కూడా ఇప్పటివరకు తక్కువగానే ఉన్నా సరే ఇక నుంచి పెరిగే అవకాశాలు ఉండవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై చర్యలు చాలా జాగ్రత్తగా చేపట్టకపోతే మాత్రం అనవసరంగా ఇబ్బందులు ఉంటాయని పలువురు సూచిస్తున్నారు. ఇక రాష్ట్రాల్లో కరోనా టెస్టులు కూడా చాలా వేగంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కరోనా టెస్ట్ లు వేగంగా చేసుకోవాలని అంతేకాకుండా జనాభా ఎక్కువగా ఉండే బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కూడా కరోనా పరీక్షలు వేగంగా చేసుకోకపోతే మాత్రం అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ సహా హిమాలయ రాష్ట్రాలైన కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దీనితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఆయా రాష్ట్రాల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఏమాత్రం  అలసత్వంగా ఉన్నా సరే అనవసరంగా దేశంలో  లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ కూడా ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంచనా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: