కరోనా  వైరస్ పుణ్యమా అని ప్రస్తుతం ఉద్యోగులందరూ ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్న తరుణంలో ఉద్యోగులు మొదట్లో ఎంతో  సంతోష పడిపోయారు. ఇంటి నుంచి పని చేయడం కంటే ఇంకా ఇంతకంటే ఏం కావాలి అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం ఉద్యోగులందరూ నుంచి వర్క్ ఫ్రమ్  హోం అంటేనే విరక్తి కలిగే పరిస్థితులు వచ్చాయి. ఇంటి  నుంచి పని చేయడం కంటే ఆఫీసుకు వెళ్ళి పని చేయడమే ఎంతో మేలు అని ప్రస్తుతం ఎంతో మంది ఉద్యోగులు భావిస్తున్నారు.



 ఈ క్రమంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగులపై రోజురోజుకు ఎంతగానో ఒత్తిడి పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆఫీసులో తెరుచుకుంటాయి అనుకుంటే వర్క్ ఫ్రమ్  హోం పొడిగిస్తూ చాలా సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇంటి నుంచి పనిచేయడం ఉద్యోగుల పై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు ఇప్పటికే నిపుణులు కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఏకంగా వర్క్ ఫ్రమ్  హోం కారణంగా మనస్తాపం చెందిన టెక్కీ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన గుజరాత్లో వెలుగులోకి వచ్చింది.



 నోయిడాలోని ఓ ప్రముఖ కంపెనీలో మూడేళ్లుగా టెకీ గా పని చేస్తున్నాడు జిగర్  గాంధీ అనే యువకుడు. కొన్ని నెలల నుంచి వర్క్ ఫ్రమ్  హోం చేస్తున్నాడు. ఇటీవల ఏకంగా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నానని... ఒత్తిడి  తట్టుకోలేకపోతున్నాను అంటూ తమతో చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ చివరికి ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం ఊహించలేదు అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే కొన్ని రోజుల్లోనే పెళ్లికి జరగాల్సి ఉన్న సమయంలో  ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తీరని విషాదం నిండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: