ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది అన్న  విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికలలో లాగానే ఈ  ఎన్నికల్లో కూడా మరోసారి విజయం సాధించి అధికార పీఠాన్ని అధిష్టించేందుకు ఎన్డీఏ కూటమి తీవ్ర కసరత్తు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే ఎంతో  వ్యూహాత్మకమైన అడుగులు ముందుకు వేస్తుంది ఎన్డీయే కూటమీ. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ సారి ఎలాగైనా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలకుంటున్నాయి.  ఈ క్రమంలోనే ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అందరూ ప్రజల్లోనే ఉంటూ ప్రజల్లోనే తిరుగుతున్నారు.



 సాధారణంగానే ఎన్నికలు వచ్చాయంటే చాలు అప్పటి వరకు ఎక్కడా కంటికి నాయకులందరూ ఏకంగా ప్రజల చెంతకు చేరి ప్రజలకు సేవ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  అంతే కాకుండా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము  అనే విషయాలను  కూడా ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీలు హామీలు ఇస్తూ న్నాయి. ఈ క్రమంలోనే అటు ప్రతిపక్ష ఇటు అధికార పార్టీలు కూడా ఎన్నికల ప్రచారంలో కరోనా వైరస్ ను తెగ వాడేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కట్టుదిట్టమైన కరోనా  నియంత్రణ చర్యలు చేపడతామని అంతేకాకుండా కరోనా వైరస్ ను ఉచితంగా అందిస్తామని ప్రస్తుతం హామీలు కురిపిస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు.



 ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తాము అంటూ ఇప్పటికే బిజెపి ప్రకటించడం సంచలనం గా మారిపోయిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు మధ్యప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో సైతం తమ రాష్ట్ర పౌరులకు ఉచితంగానే కరోనా వైరస్ వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇస్తున్నారు. కరోనా  వైరస్ ప్రజలకు అందుబాటులోకి రాగానే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రస్తుతం హామీలు ఇస్తూ ప్రజలందరిని ఆకర్షించే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: