ఎంతో మంది పేద విద్యార్థులు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నప్పటికీ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల లో శిక్షణ తీసుకునేందుకు సరైన స్తోమత లేక వెనకడుగు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఏదో ఒక విధంగా తమకు ఉన్నంత లో  శిక్షణ తీసుకుంటూ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసు కుంటూ ఉంటారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి పేద విద్యార్థులకు చేయూత అదేవిధంగా కీలక నిర్ణయం తీసుకున్నది . కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ శుభవార్త తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.



 ఉచితంగానే కానిస్టేబుల్ శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులకు శుభ వార్త అందింది అని చెప్పాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులందరికీ ఇంటర్ బోర్డు ఉచితంగా కానిస్టేబుల్ శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది.  మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి.  కాగా ఈ 402 కాలేజీలలో మొదట 20 కాలేజీలను ఎంపిక చేసి తొలుత రాత పరీక్షలు నిర్వహించిన తర్వాత కానిస్టేబుల్ శిక్షణ ను ప్రారంభించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది.



 దీంతో కానిస్టేబుల్ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నప్పటికీ ఆర్థిక స్తోమత దృష్ట్యా సరైన  శిక్షణ తీసుకోలేక వెనుకడుగు వేసే విద్యార్థులందరికీ ఇటీవల ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఒక గొప్ప శుభవార్త అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం కాలేజీలను తెరిచేందుకు నిర్ణయిస్తే కాలేజీలోనే ప్రత్యక్షంగా విద్యార్థులకు శిక్షణ నిర్వహిస్తామని లేనిపక్షంలో ఆన్లైన్ ద్వారా శిక్షణ నిర్వహిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ స్పష్టం చేశారు. ఇక మరోవైపు త్వరలోనే 17000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ భావిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: