చాలా మంది ఇళ్లల్లో మనం ఈ సమస్యతో సతమవ్వడం చూసే ఉంటాం.  బల్లుల కి కొంత మంది భయపడతారు కూడా.  అయితే వీటిని తరిమేయ్యడం కూడా కష్టమే. మరి వీటి నుండి మనం ఎలా బయట పడాలి..? ఈ విషయం లోకి వస్తే.... బల్లుల నుండి బయట పడాలంటే కేవలం మన కిచెన్ లో ఉండే సామాన్లని ఉపయోగించి ఇలా చేసేయండి. బల్లుల నుండి సులువుగా బయట పడచ్చు. ముందు ఒక ఉల్లిపాయ తీసుకోండి. దాన్ని ముక్కలుగా తరిగి మిక్సీ పట్టండి. ఇప్పుడే కేవలం ఆ నీళ్ళని  తీసుకుని దానిలో   8 లవంగాలు 10 మిరియాలు కలిపి దంచి చేసిన పొడిని వేసి కలపండి.

సహజంగా ఉల్లి కి ఘాటు ఎక్కువ. మనం మిరియాలు లవంగాలు వేసాం కదా... ! ఆ ఘాటు మరెంత ఎక్కువ అయ్యింది. సాధారణంగా అంత ఘాటు మనకే కష్టం. ఇంక బల్లులు ఏం  తట్టుకోగలవు. ఇప్పుడు ఒక డెటాల్ సబ్బు ని  తీసుకోండి. ఒక చిన్న ముక్క కట్ చేసి ఆ నీళ్ల లో కలపండి. మీ దగ్గర  డెటాల్ లిక్విడ్ ఉంటె దానినైన  వాడొచ్చు. ఈ డెటాల్ సబ్బు  లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు  ఎక్కువగా ఉంటాయి కనుక అదే బెటర్.

ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే ఆ నీటిని ఒక బాటిల్ లో పోసి స్ప్రే చేయండి. లేదంటే ఆ నీళ్లను తీసుకుని చిన్న దూదిని ముంచి తలుపు చివర పెట్టండి. ఆ ఘాటుకి బల్లులు, పురుగులు ఇవేమి చేరవు. కాబట్టి మంచి సులువైన పద్దతి ఇది. అలాగే నెమలీకలు కూడా గోడ మీద అంటిస్తే బల్లుల బెడద కొంత వరకు తగ్గుతుంది.  ఇలా ఎంతో సులువైన మార్గాల ద్వారా బల్లుల ని మనం తరిమి కొట్టొచ్చు. మరి ఇంకేం అనుసరించేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: