దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ అండ్ మర్డర్ కేసు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. సంవత్సరం నుండి డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్ వాడుతున్న నిందితుడు... అదే యాప్ నుంచి ఫోన్ చేసాడు అని గుర్తించారు. తన గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ చేసేందుకు యాప్ ను సంవత్సరం నుండి  ఉపయోగిస్తున్నాడు. అదే యాప్ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన మంద సాగర్...  వారిని బెదిరించాడు.

నిందితుడు మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా యాప్ ద్వారా కాల్స్ చేయటంతో పోలీసులకు 3 రోజులు పాటు సవాలు గా మారింది ఈ కేసు. పెట్రోల్ బంక్ వద్దకు వెళ్దామని చెప్పి మందసాగర్ బాలుడ్ని తీసుకుని వెళ్ళాడు. తెలిసిన వ్యక్తి కావడంతో పిలవగానే  బాలుడు దీక్షిత్ వెళ్ళాడు. అప్పటికే స్థానిక మెడికల్ స్టోర్ నుండి రెండు నిద్రమాత్రలు కొనుగోలు చేసాడు సాగర్. మార్గమధ్యంలో ఒక చోట మంచినీళ్లు తాగెందుకు బండి ఆపాడు. ఆ మంచి నీళ్లలోనే నిద్రమాత్రలు వేసాడు. బాబు మత్తులోకి జారుకునీ స్పృహ వచ్చేలోపు బాలుడిని హత్య చేసాడు.

టూవీలర్ స్పేర్ పార్ట్స్ దుకాణం నడుపుతున్నాడు అని పోలీసులు పేర్కొన్నారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసాడు. ఒక చౌరస్తా దగ్గరికి బాలుడు తండ్రిని రమ్మని చెప్పి షాపులో నుండి రంజిత్ రెడ్డి కదలికలను గమనించాడు. మఫ్టీలో పోలీసులు ఫాలో అవుతున్నారు అన్న అనుమానంతో మళ్లీ యాప్ నుండి రంజిత్ రెడ్డి కి ఫోన్ చేసాడు. హత్య చేసిన వెంటనే మనోజ్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. బాలుడి తలిదండ్రుల రియాక్షన్ చూసేందుకు వెళ్ళాడు. తల్లిదండ్రులు కిడ్నాప్ గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే లోపే బాలుడిని హత్య చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: