నేటి కాలంలో అనేక మంది డయాబెటిస్ తో అనేక ఇబ్బందులని పడడం మనం చూస్తున్నాము. అటువంటి వారు అంత కూడా ఈ పద్ధతులని అనుసరిస్తే చాలా మంచిది.  మీ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడం తో పాటు అనేక సమస్యలకి చెక్ పెట్టాలంటే మీరు ఇవి తప్పక పాటించాలి.  మరి ఇంక వాటి గురించి ఇప్పుడే చూసేయండి. మధుమేహం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తవచ్చు. ఇది  గుండె జబ్బులు లేదా నరాల దెబ్బ తినడం తో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది గుర్తుంచుకోండి. కొన్ని సరళమైన జీవన శైలి మార్పులను చేయడం ద్వారా మధుమేహాన్ని అదుపు లో ఉంచవచ్చు  మరియు ఒత్తిడిని ఎదుర్కోవచ్చు - సమతుల్య ఆహారం తినడం, శారీరకంగా చురుకుగా ఉండటం , రక్తం లో చక్కెరను పర్యవేక్షించడం, తగినంత నిద్ర పొందడం వంటివి అనుసరించండి .



మీ రోజును పోషకమైన అల్పాహారం తో ప్రారంభించండి. ఇది మీ రక్తంలో చక్కెర నిర్వహణ మరియు మొత్తం ఆరోగ్యానికి నిజమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ఎప్పుడు బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చెయ్యకండి. వీలైనంత వరకు మంచి ఆహారాన్నే తీసుకోండి. స్వీట్స్ కి స్వస్తి చెప్పేయండి.  అలానే మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నీరు త్రాగటం అలవాటు చేసుకోండి. ఇది  మీ ఆరోగ్యానికి అద్భుతాలు ఇస్తుంది. అలానే ఇది మీ శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి మరియు పేగును శుభ్రపరచడానికి  బాగా సహాయ పడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం మంచి ఫలితాలని ఇస్తుంది.



 మీ షుగర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. అలానే ఎప్పటికప్పుడు డాక్టర్ ని కూడా సంప్రదిస్తూ ఉండండి.ఇలా ఈ టిప్స్ ని అనుసరించండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.



 

మరింత సమాచారం తెలుసుకోండి: