టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. హీరోలు, హీరోయిన్ లు రాజకీయ నాయకులు ఇలా ప్రతీ ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ప్రభాస్ ని విష్ చేస్తున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటుగా మరికొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.  ఇక రాజ్యసభ ఎంపీలు కూడా ప్రభాస్ ని విష్ చేసారు.

 సంగీత దర్శకుడు తమన్, రాజమౌళి కుమారుడు కార్తికేయ సహా నటులు సందీప్ కిషన్, శ్రీ విష్ణు, హీరో సాయి ధరమ్ తేజ్  సహా పలువురు విష్ చేసారు. ప్రభాస్ తెలుగు సినిమా రేంజ్ పెంచిన హీరో అని వారు పేర్కొన్నారు. ప్రభాస్ కి ఈ ఏడాది మంచి విజయాలు రావాలి అని వారు ఆకాంక్షించారు. ప్రభాస్ తో  దిగిన ఫోటోలను కూడా షేర్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: