ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.. ఎన్నో వేల ఎకరాల్లో పండించిన పంట నీటిపాలు అయ్యింది. మాములుగా కురిసిన వర్షాలకే పాములు, తెళ్లు ఇతర విష జీవులు ఇళ్లలోకి వస్తాయి. ఇక ఈ మధ్య కురిసిన  భారీ వర్షాలకు విష పురుగులు ఇళ్లల్లోకి వస్తున్నాయి. హైదరాబాద్ లో మొన్న కురిసిన భారీ వర్షాలకు పురానాపూల్ ప్రాంతం లోకి ఓ పెద్ద కొండచిలువ వచ్చింది. కొందరు యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దానిని పట్టుకొని సంచిలో వేసి బంధించారు. వరద నీరు ఇళ్లలోకి వస్తుండటంతో ఆ ప్రాంతంలో పాములు, చేపలు వస్తుండటం తో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు..



ఇప్పుడు అలాంటి ఘటనే గుంటూరులో వెలుగు చూసింది.. గత కొద్ది రోజులుగా ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లలోకి పాములు, చేపలు వస్తున్నాయి. ఇక పంట పొలాల విషయం అయితే చెప్పాల్సిన పనిలేదు.. ఎక్కడ చూసినా నీరు వచ్చి చేరడంతో పంటలను నీటితో మునిగిపోయాయి. వరద నీరు ఇంకా వస్తుండటంతో పాములు నీటిలో కొట్టుకు వస్తున్నాయి. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.



తాజాగా గుంటూరు జిల్లాలోని పంట పొలాల్లో ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది.. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని తాడేపల్లి మండలం ఉండవల్లిలో వరద నీటిలో కొండ చిలువ కూడా కొట్టుకొని వచ్చింది. పొలాల పక్కన సంచరిస్తూ ఉండడంతో అది చూసిన రైతులు, స్థానికులు భయ భ్రాంతులకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు. కొండచిలువ భారీగా ఉండటంతో ఏమీ చేయలేక పోయారు. అనంతరం ఈ విషయాన్ని  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కొండచిలువను చూసి భయపడ్డారు. ఈ విషయంపై  అటవీశాఖ అధికారులకు ఫోన్ చేశారు. అటవీశాక అధికారులు ఆ కొండ చిలువను పట్టుకున్నారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: