తెలంగాణలో కాంగ్రెస్ బలపడాలి అని చూస్తుంది కాబట్టి... అన్ని విధాలుగా కూడా తనకు అనుకూలంగా మార్గాలు సృష్టించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇతర పార్టీల నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ బలపరిచే విధంగా రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్. అయితే ఆ పార్టీకి అనుకున్న విధంగా పరిస్థితులు కలిసి రావడం లేదు అనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ లో ఉన్న వర్గ విభేదాలు పార్టీని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్నాయి అనే మాట అక్షరాల నిజం.

కీలక నేతలు అందరూ కూడా ఇప్పుడు వర్గ విభేదాలతో ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని విధాలుగా చెప్పినా సరే కొంతమంది నేతలలో మాత్రం మార్పు అనేది రావటం లేదు.  ప్రధానంగా రేవంత్ రెడ్డి ని టార్గెట్ గా చేస్తూ కొంత మంది వ్యవహరించడంతో కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆయన ఎంపీగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు.

అలాంటి నేతను కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారు. తప్పు ఎక్కడ ఉంది అనేది తెలియదు గానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఇప్పుడు పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతోంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నిలబెట్టాలి అంటే రేవంత్ రెడ్డి సహకారం అనేది చాలా అవసరం. అయినా సరే ఆయన సహకారం లేకుండా నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. మరి భవిష్యత్తులో ఆ పార్టీకి ఏ విధంగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: