దుబ్బాక నియోజక వర్గంలో ఉప  ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు  హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే. దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయం తెలంగాణ ప్రభుత్వ పాలనకు నిలువుటద్దంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అటు అధికార పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో ఈసారి కూడా విజయం సాధించి.. టిఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు  రంగంలోకి దిగి దుబ్బాక లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.



 ఈ క్రమంలోనే అటు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ నుంచి కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఉంది అని చెప్పాలి. ఇక ప్రచార రంగంలో అటు ప్రతిపక్ష పార్టీలు ఇటు అధికార పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు బిజెపి పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.



 అంతే కాదు బీజేపీ అంటే ఏంటో కొత్త పేరు కూడా పెట్టారు మంత్రి హరీష్ రావ్. కాంగ్రెస్ బిజెపి నేతలు దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మాయ మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మండిపడిన మంత్రి హరీష్ రావు... మోడీ అధికారంలోకి వస్తే కోటి మందికి ఉద్యోగాలు ఇస్తాము  అంటూ హామీ ఇచ్చారని ఇప్పటివరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటూ ప్రశ్నించారు. బిజెపి పార్టీ అంటే భారతీయ ఝటా  పార్టీ అంటూ మంత్రి హరీశ్ రావు  ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కూడా సరిగా ఉండేది కాదని కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం  24 గంటల విద్యుత్ అందిస్తుంది అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: