వయసుతో ఏముంది. విషయం ఉంటే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎవ‌రెస్ట్ శిఖరాలను సైతం తాకవచ్చు. ఇది చరిత్ర ఏనాడో నిరూపించింది. ఇక్కడ ఏజ్ కాదు ప్రశ్న. ఎపుడొచ్చామన్నది అంతకంటే కూడా కాదు, దెబ్బ తీశామా లేదా అన్నదే చర్చ. ఇదంతా ఎందుకూ అంటే బీహార్ లో ఇపుడు అతి పెద్ద రాజకీయ  మార్పునకు నాంది పడబోతోందిట. జంగిల్ రాజ్, అవినీతి పాలన అంటూ ఏ లాలూ ప్రసాద్ కుటుంబాన్ని అయితే జనం దూరం పెట్టారో ఇపుడు ఆ  కుటుంబాన్నే నెత్తికెక్కించునేలా సీన్ అయితే కనిపిస్తోంది.

నిజానికి బీహార్ లో  నిజాయతీ, నిరాడంబరత అన్న పదాలకు నిలువెత్తు నిదర్శనంగా నితీష్ కుమార్ ఉన్నారు. కానీ నితీష్ కుమార్ పదిహేనేళ్ళుగా సీఎం గా ఉన్నారు. ఆయన బోరు కొట్టేశారుట. పైగా ఆయన కూడా ఈ మధ్య  లాలూతో ఒకసారి, బీజేపీతో మరోసారి ఇలా చేతులు కలిపి తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకున్నారుట. ఇక ఆయన పదవి కోసం అవకాశవాద రాజకీయాలకు తెర తీశారని అర్ధమైపోయిన తరువాత మోజు ఒక్కసారిగా దిగిపోయిందట.

దాంతో అవినీతి, అక్రమాలు అంటూ లాలూ ఫ్యామిలీని విమర్శించిన జనాలే లాలూ రాజకీయ వారసుడిగా ఉన్న తేజశ్వి యాదవ్ కి పట్టం కట్టబోతారా అన్న చర్చ అయితే గట్టిగా ఉంది. లాలూ జైలులో ఉండగా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. దాంతో తండ్రి సానుభూతి కూడా తేజశ్వి యాదవ్ కి తోడుగా ఉంది. అంతే కాదు, ముప్పయ్యేళ్ల యువకుడు తేజశ్వి కావడంతో యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారుట. ముందే చెప్పినట్లుగా  వయసు మీరిన నితీష్ అంటే బోర్ అనేస్తున్నారుట.

వీటికి తోడు గత ఎన్నికల్లో చేప్పిన హామీలను కూడా నెరవేర్చలేదన్న అసంతృప్తి ఎటూ ఉంది. పదిహేనేళ్ళ పాలన తాలూకా యాంటీ ఇంకెంబెన్సీ కూడా తోడుగా ఉంది. దీంతో ఈసారి కుర్చీ నుంచి నితీష్ ని దింపేయడానికి తేజశ్వి రెడీ అవుతున్నారుట. అదే టైంలో మోడీకి కూడా బీహార్ షాక్ గట్టిగానే తగలనుంది అంటున్నారు. దాంతో ఎన్నికల ఫలితాలు చాలా ఆసక్తిగా ఉంటాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: