మోదీ సర్కార్ అధిష్టానంతో ప్రజలు లబ్ది పొందుతున్నారు.. రైతులు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు అని మోదీ చాలా సందర్భాల్లో అన్నారు. అందుకోసం వారి ఇంట సంతోషాన్ని నింపేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులు బాగుంటే దేశం పచ్చగా ఉంటుందనే ఉద్దేశ్యం తో రైతుల కొరకు కొత్త రుణాలను అందిస్తున్నారు. దాంతో ఇలాంటి కష్ట కాలంలో కూడా  రైతులు కొంతవరకు పంటలను పండిస్తున్నారు.భారత ప్రభుత్వం రైతులను అన్నీ విధాలుగా ఆదుకుంటుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం  రైతు కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కిసాన్ కార్యక్రమం వల్ల రైతులు భూమికి సంబంధించిన మరింత సమాచారాన్ని పొందవచ్చును..



మరో గొప్ప ఆలోచనను మోదీ ఇటీవల అమలు చేశారు .. రైతులకు అందించిన కిసాన్  ద్వారా రైతులు పంటలకు కావలసిన మందులను.. విత్తనాలను కొనుగోలు చేసుకోవచ్చు.. ఇటీవల మోదీ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త ను అందజేశారు. కిసాన్ కార్డులను ఉపయోగించి పాడి పశువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చునని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు నష్టపోరని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలోచన మంచిదేనని మోదీ పై రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇటీవల కాలంలో మోదీ మరో కొత్త  పథకానికి శ్రీకారం చుట్టారు..ఎక్కడ పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని మోదీ చెప్పారు. ఈ మేరకు అనంతపురం రైతులు టమోటాలను ఢిల్లీ వెళ్లి అమ్ముకున్నారు. కిసాన్ పేరుతో తిరుగుతున్న రైల్లో ఢిల్లీ కి రవాణా చేసి అమ్ముకున్నారు. మాములుగా రైతుల దగ్గర టమోటా 5 నుంచి పది రూపాయలు పలుకుతోంది. బయట మార్కెట్లలో 40 వరకు కిలో అమ్ముతుంది. ఈ క్రమంలో మోదీ చెప్పిన మాటలను అక్కడి రైతులు పాటించారు. అనంతపురం మొత్తం పండించిన టమోటాను ఢిల్లీ మార్కెట్లలో అమ్మారు.. దీంతో కిలో 30 రూపాయలు వచ్చింది.  రైలు కాకుండా ఇతర వాహనాలలో అయితే ఎక్కువ ఖర్చు అయ్యేది.. కానీ రైల్లో వెళ్లడంతో తక్కువ ఖర్చుతో, ఎక్కువ లాభాలను ఆర్జించారు.. మరి ఈ రైలు మున్ముందు అందుబాటులో ఉంటుందా లేదా అనేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: