ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో సీఎం జగన్ చాలావరకు దూకుడుగా వెళుతున్నారు. అయితే గత కొన్ని పరిణామాలు మాత్రం కాస్త భిన్నంగా ఉన్నాయి. రాజకీయంగా సీఎం జగన్ కు ఇబ్బంది లేకపోయినా సరే ఇప్పుడు మాత్రం విపక్షాలు చేసే కొన్ని ఆరోపణలు ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి అనే మాట వాస్తవం. అసలు ఎందుకు పెడుతున్నాయి... ఏంటి అనేది చూస్తే ఏ సంక్షేమ కార్యక్రమం ప్రవేశపెట్టిన సరే దానికి తెలుగుదేశం పార్టీని లింక్ పెట్టుకుని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

గతంలో చంద్రబాబు నాయుడు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను మళ్లీ అమలు చేస్తూ పేరు మారుస్తున్నారని... సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి అడ్డం పడుతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ప్రజలకు వివరించాలని సీఎం జగన్ పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన తర్వాత వాటిని ప్రచారం చేసుకునే విషయంలో విఫలం అవుతున్నారు. గత ప్రభుత్వాలు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించాయి ఇప్పుడు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నాయి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

మంత్రులు అదేవిధంగా కార్యకర్తలకు పలు సూచనలు చేస్తున్నారు సీఎం జగన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ద్వారా తెలుగుదేశం పార్టీ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని సీఎం జగన్ సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా అమలు చేయలేని  సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన విషయాన్ని...   ఎక్కడా కూడా ఇలా లేదు అనే విషయాన్ని సీఎం జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలని ఎమ్మెల్యేలకు కూడా సూచిస్తున్నారు. ఎంపీలు కూడా ఇప్పుడు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అప్రమత్తం కాకపోతే అనవసరంగా నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: