చంద్రబాబు రాజకీయ తంత్రం గురించి అందరికి తెలిసిందే.. ఉన్న చోటే ఉండి రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించగల వ్యక్తి చంద్రబాబు  నాయుడు.. ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయి కొంత ఢీలా పడిపోయాడే గానీ తనదైన టైం లో రాజకీయాల్లో ఎంత చక్రం తిప్పగలిగాడో అంత చక్రం తిప్పేశాడు.. సీనియర్ నాయకులను సైతం మైమరిపించే వ్యూహాలు వేశాడు చంద్రబాబు.. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే తమ నేతలను కొంతమంది బీజేపీ లోకి పంపాడు చంద్రబాబు.. కొన్ని రాజకీయ ప్రయోజనాల మేర ఇబ్బందులు తలెత్తుతాయని ముందే ఊహించి వారిని బీజేపీ లోకి పంపి కొంత సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశారు..

ఎలాంటి రాజకీయాలనైనా తనకు అనుగుణంగం గా మార్చుకోవడం చంద్రబాబు కు బాగా అలవాటు.. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ రాజకీయం చేయడానికి పెద్దగా ఆస్కారం ఉండదు.. అధికారంలోకి రావడానికి కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ తన రాజకీయ జ్ఞానానికి పదును పెడతాడు చంద్రబాబు.. ఇక ప్రజల తీర్పు తో ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు తన మేధో సంపత్తి కి పదును పెడుతూ ఎలా అధికార ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు.. దొరికిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంటూ తనకు అభాసుపాలవుతున్నా విక్రమార్కుడి వలే పోరాడుతున్నారు..

ఇక జగన్ చంద్రబాబు విరుద్ధంగా చంద్రబాబు చేసిన పనులను సరిదిద్దుతూ వస్తున్నాడు..  ఏటా పిల్లలను బడిలో చేర్చడమే తప్ప అందుకు బిల్లులు చెల్లించాలనే స్పృహ లేకుండా వ్యవహరించారు. చివరకు 2017 నుంచి బడులకు చెల్లించాల్సిన ఫీజులు ఇవ్వకుండా చేతులెత్తేశారు.బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదివిన గిరిజన విద్యార్థుల బకాయిలను తాజాగా ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి విడుదల చేశారు. సుమారుగా రూ.50కోట్ల పైబడిన నిధులను చెల్లించారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ చెల్లిస్తూ ప్రభుత్వం వివిధ జిల్లాలకు నిధులను మంజూరు చేసిందని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. ఈ మేరకు నిధులను కూడా ఆయా జిల్లాలకు విడుదల చేయడం జరిగిందని తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి: