టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. కరోనా మొత్తం తగ్గిపోయే స్థితిలో ఉన్నా, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తిరిగే పరిస్థితి ఉన్నా టీడీపీ పార్టీ నేతలు మాత్రం ఆ సాకుతో గడప దాటకుండా సేవను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు.. సరే నేతలు అంటే ఎదో అనుకుందాం పార్టీ అధినేతలు సైతం ఇంటిపట్టునే ఉంటూ చోద్యం చూస్తుండడం ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.. కరోనా అని ఎప్పుడైతే తొలి సారి పేరు వినపడిందో అప్పటినుంచే చంద్రబాబు, లోకేష్ లో ఇంట్లో ముసుగు తన్ని పడుకుంటున్నారు..ఎదో ఫార్మాలిటీ కి ఆన్ లైన్ రాజకీయాలు చేస్తున్నారు కానీ అందులో ఎలాంటి ఇంట్రెస్ట్ కనిపించడం లేదు.. పార్టీ ఓడిపోయినందుకు వారు అలా చేస్తున్నారా లేదా నిజంగానే కరోనా భయం వల్ల రావట్లేదా అన్నది తెలీట్లేదు..

ఇక చూసి చూసి తెలుగు తమ్ముళ్లకు కూడా విసుగు వచ్చినట్లుంది.. అందుకే భవిష్యత్ లేని పార్టీ లో ఉండడంకంటే వెళ్ళిపోవడం మేలు అని ఇతర పార్టీ లకు తరలిపోతున్నారు.. ఇక వీరు వెళ్ళిపోవడానికి వేరే కారణం కూడా ఉందట..ఇక ఉన్న వారిని కూడా చంద్రబాబు హింసిస్తున్నారని తెలుస్తుంది.. టీడీపీ కార్యకలాపాలు తాము లేకున్నా పర్వాలేదు మీరే చేయమని చెప్తూ వారిని చిత్రవధ చేస్తున్నారట.. ఇటీవలే పార్లమెంటరీ నియోజకవర్గాలకు చంద్రబాబు ఇన్ ఛార్జిలను నియమించారు. వారు తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

కానీ ఈ సమావేశాలకు నేతల నుంచి పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జిల పేర్లను వీళ్లు పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన నేతలతో పాటు ముఖ్య నేతల పేర్లను కూడా వీరు సేకరిస్తున్నారని తెలిసింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన నేతలు ఎక్కువగా వ్యాపారాలపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి తాము ఆర్థికంగా సన్నద్ధులం కావాలంటే వ్యాపారాలపై దృష్టి పెట్టక తప్పదని నేతల ఎదుటే చెబుతున్నట్లు తెలిసింది. వ్యాపారాలను వదిలేసి నియోజవర్గాల్లోనే ఉండమంటే, వచ్చే ఎన్నికల్లో పార్టీ నిధులను ఇస్తుందా? అని ఎదురు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. దీంతో పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ ఛార్జులు తలలు పట్టుకుంటున్నారు.  అటు చంద్రబాబు వత్తిడి వీరు చెప్పే కారణంతో వారు మమ్మల్ని వదిలేయండి అని బాబు ని ప్రాధేయపడుతున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: