ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రతి చిన్నవాడు కూడా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో ప్రజలకు ఆగ్రహాన్ని కలగజేస్తుంది.. అధికారులు అన్న తర్వాత తమ పని తాము చేసుకుని వెళ్ళాలి కానీ పాలిటిక్స్ లో వేలుపెట్టడం వారి భవిష్యత్ కి అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం ఎంతటి దుమారం రేపిందో అందరికి తెలిసిందే.. రాష్ట్రంలో కరోనా లేని సమయంలో అదో సాకుగా చేసుకుని అయన ఎన్నికలను వాయిదా వేయడం ఆ టైం లో ఒకింత పెద్ద వివాదానికి తెరలేపారు..

ఆ తర్వాత కోర్టులు కేసులు అని ఆరునెలలు తిరిగిన తర్వాత కానీ ఆయనకు బుద్ధి రాలేదు.. ఎలాగో తన పదవిని తాను పొందిన కూడా ప్రభుత్వానికి ఎప్పుడు అయన సహకరించడం లేదు.. ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి ప్రజల శ్రేయస్సు చూడాల్సింది పోయి ఓ పార్టీ కి అండగా అయన పనిచేయడం మూలానా, ఇప్పుడు ఆ పార్టీ నేతలు, అయన బాగానే ఉన్నా ప్రజలు మాత్రం చాలా ఇబ్బందిపడుతున్నారు..  ఇక ఇన్ని రోజుల తర్వాత కూడా అదే కుక్కతోక వంకర బుద్ధి ని చూపిస్తూ మరోసారి జగన్ ని టార్గెట్ చేస్తూ ఓ పన్నాగం పన్నుతున్నదని తెలుస్తుంది..

న్నికల వాయిదా పై స్పష్టత లేని ప్రకటన చేసి సంచలనంగా మారిన నిమ్మగడ్డ ఈసారి మళ్లీ ఎన్నికల సన్నాహాలకు పూనుకున్నారు. ఈనెల 28న రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ మీద పార్టీల అభిప్రాయాల సేకరణకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. అయితే వాస్తవానికి నాడు ఎన్నికలు వాయిదా వేసిన నాటి కన్నా ప్రస్తుతం కరోనా తీవ్రంగా ఉంది. కేసులు సంఖ్య దానికి నిదర్శనంగా ఉంది. మృతుల విషయంలోనూ దాని ప్రభావం స్పష్టమవుతోంది. అయినప్పటికీ నాడు వద్దన్న ఎన్నికలు ఇప్పుడు నిమ్మగడ్డకు ముద్దు అయ్యాయి.దీని వెనుక నిమ్మగడ్డ ఎన్నికల అధికారిగా కన్నా రాజకీయంగానే ఎక్కువగా ఆలోచిస్తున్నారా అనే సందేహం వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: